EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?
EPF Rate of interes: ఈ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ( EPFO)ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఇందులో చందాదారులుగా ఉంటారు. ప్రతి నెల వేతనం నుంచి ఈపీఎఫ్ కట్ చేస్తారు. ఈ డబ్బును సంస్థ ఒక ఫండ్ లాగా ఉపయోగిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగి పదవి విరమణ అనంతరం పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ లభిస్తుంది. దీనిపై వడ్డీ కూడా ఉంటుంది కావున మీరు పెట్టిన పెట్టుబడికి మంచి మొత్తంలో లాభం వస్తుంది. అలాగే సంస్థ కూడా మీ తరఫున డబ్బు చెల్లిస్తుంది కావున పెద్ద మొత్తంలో మీకు డబ్బులు లభిస్తుంది.
అయితే ప్రస్తుతం మనం ఈపీఎఫ్వో ద్వారా 4 కోట్ల రూపాయల అదేవిధంగా 5 కోట్లు, 6 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలంటే, ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూషన్ చెల్లించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పదవీ విరమణ సమయానికి రూ.4 కోట్లు పొందడానికి, 40 ఏళ్లపాటు నెలకు రూ.11,200 కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. మెచ్యూరిటీపై, మీరు ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతం మొత్తం రూ. 4,02,59,738 పొందుతారు.
పదవీ విరమణపై రూ. 5 కోట్లు పొందడానికి, 40 ఏళ్లపాటు నెలకు రూ.12,000 విరాళంగా ఇవ్వాలి. మెచ్యూరిటీపై, ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతం మొత్తం రూ. 5,08,70,991.64 పొందుతారు.
పదవీ విరమణపై రూ.6 కోట్లు పొందడానికి, 44 ఏళ్లపాటు నెలకు రూ.12,100 విరాళంగా ఇవ్వాలి. మెచ్యూరిటీపై, ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతం మొత్తం రూ. 6,04,35,029.1 పొందుతారు.
అంతేకాదు మీరు ప్రావిడెంట్ ఫండ్ నుంచి మీకు డబ్బు అత్యవసరం అయినప్పుడు కొద్ది మొత్తంలో ఉసంహరించుకునే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు ఆరోగ్య సమస్యలు, ఇంటి నిర్మాణము, వివాహము వంటి ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మీరు ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు.