EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేశారు. 8.5 శాతం వడ్డీని పీఎఫ్ నగదుపై అందిస్తున్నారు. అయితే కొందరు ఈపీఎఫ్ఓ(EPFO) ఖాతాదారులు తమ ఖాతాకు నగదు రాలేదని ఆందోళన చెందుతున్నారు.
తొలుత http://epfindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఈ పాస్‌బుక్ మీద క్లిక్ చేయండి అక్కడ మీ వివరాలు నమోదు చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది మెంబర్ ఐడీ వివరాలు సబ్మిట్ చేస్తే ఈపీఎఫ్ బ్యాలెన్స్(PF Balance) వివరాలు కనిపిస్తాయి.
Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!
మీ పీఎఫ్ అకౌంట్‌లోకి వడ్డీ డబ్బులు రాకపోతే మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం బయటకు వెళ్లాల్సిన పనిలేదు. పీఎఫ్ వడ్డీ నగదు ఈపీఎఫ్ ఖాతాల్లోకి రాని వారు https://epfigms.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఆ వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ గ్రీవెన్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం మీరు పీఎఫ్ మెంబర్(PF Member) అనే ఆప్షన్ ఎంచుకోవాలి. యూఏఎన్ నెంబర్(UAN Number), క్యాప్చా ఎంటర్ చేసి.. గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి. మీ UAN నెంబర్‌తో లింక్ అయిన పీఎఫ్ ఖాతా వివరాలు కనిపిస్తాయి.
వివరాలు కనిపించాక OTP ఎంటర్ చేయాలి. తర్వాత మీ పీఎఫ్ అకౌంట్(PF Account) ఎంచుకోవాలి. పీఎఫ్ ఖాతాకు వడ్డీ రాలేదని తెలపడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఫిర్యాదుకు సంబంధించిన నెంబర్ వస్తుంది. కొంతకాలానికి సమస్య పరిష్కారం అవుతుంది.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!