EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

Thu, 18 Feb 2021-7:04 am,
EPFO Alert: If You Have Not Received EPF Interest Account

EPFO Latest Update: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. 2019-20 సంవత్సరానికిగానూ ఈపీఎఫ్ వడ్డీని ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ మంత్రి ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. ఏడాది సమయం తర్వాత ఈపీఎఫ్ ఖాతాల్లో వారి నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తోంది.

Also Read: EPFO ఖాతాదారులకు Bad news.. PF interest rates తగ్గే అవకాశం

EPFO Alert: If You Have Not Received EPF Interest Account

అయితే 40 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు తమ ఈపీఎఫ్ఓ ఖాతాల్లోని నగదుపై వడ్డీ అందలేదు. ఇదే విషయాన్ని ఈఫీఎఫ్ఓ సైతం స్పష్టం చేసింది. ఈపీఎఫ్ ఖాతాదారుల KYC వివరాలు సరిపోలలేదని, ఆ తప్పిదాల కారణంగా నగదు పీఎఫ్ వడ్డీ నగదు జమ చేయలేదని పేర్కొంది.

Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్

EPFO Alert: If You Have Not Received EPF Interest Account

కేవైసీ డాక్యుమెంటేషన్ పూర్తి చేస్తే వీరికి 8.5 శాతం వడ్డీ మొత్తం త్వరలో ఖాతాలో చేరనుంది. 2019-20 సంవత్సరానికిగానూ ఆ 40 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు వడ్డీ నగదు ఖాతాకు చేరాలంటే KYCని సరైన వివరాలతో పూర్తి చేయాలి. ఇంటి వద్ద నుంచే కేవైసీని అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది. 

Also Read: EPF ఖాతాదారులకు EPFO సరికొత్త సదుపాయం, ఆ సమస్యకు పరిష్కారం

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface కు వెళ్లాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఆ తరువాత KYC ఆప్షన్ మీద క్లిక్ చేసి.. PAN, Aadhaar, Mobile Number, Bank Account వివరాలు ఒకదాని తర్వాత ఒకటి నింపాలి.  అయితే మీ PAN మరియు Aadhaar నెంబర్ అనుసంధానం చేసి ఉంటే కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసే అవకాశాన్ని కల్పించింది.

సరైన సమాచారం ఇస్తేనే మీకు అన్ని ప్రయోజనాలు అందుతాయి. IFSC నెంబర్ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ యూఏఎన్‌కు సరైన వివరాలతో లింక్ చేయాలి. లేనిపక్షంలో మీరు పీఎఫ్(PF Balance) విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link