EPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన
EPFO CBT Meeting: కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవ్య అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 236వ సమావేశంలో అనేక ప్రధాన సమస్యలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో, ఆటోక్లెయిమ్ సెటిల్‌మెంట్ సౌకర్య పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. దీనితో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.15 కోట్ల క్లెయిమ్‌లు వచ్చాయని, వీటిని ఆటో మోడ్‌లో పరిష్కరించినట్లు సమాచారం. నవంబర్ నెలలో కూడా తిరస్కరణ రేటు 14 శాతానికి తగ్గింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో, 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు రూ.1.57 లక్షల కోట్ల విలువైన 3.83 కోట్ల క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌ఓ పరిష్కరించింది.
CITES 2.01 ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు, EPFO దాని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రెండింటినీ అప్‌గ్రేడ్ చేస్తోంది. అదే సమయంలో, CITES 2.01 ప్రాజెక్ట్ కింద, ఆటో క్లెయిమ్ సదుపాయాన్ని మరింత సులభతరం చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వెర్షన్ సిద్ధం చేస్తోంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్త వెర్షన్‌లో, UAN నంబర్ ద్వారా అకౌంటింగ్ సాధ్యమవుతుంది. దీని కారణంగా ఒక సభ్యుడు, ఒక ఖాతా మాత్రమే ఉంటుంది. అంతేకాదు పీఎఫ్ క్లెయిమ్‌ను పరిష్కరించడం కూడా మరింత సులభం అవుతుంది.
ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగి భవిష్యనిధి సంస్థతో రిజిస్టర్ కాకపోవడం ఉద్యోగుల నిధులను డిపాజిట్ చేయకుండా ఎగవేతలకు పాల్పడినట్లయితే సంస్థలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఈపీఎఫ్ఓ అమ్నెస్టీ స్కీమ్ 2024 తీసుకురావాలని కేంద్రానికి సిబిటీ ప్రతిపాదించింది.
ఆన్ లైన్ డిక్లరేషన్ ద్వారా ఈ సదుపాయం తీసుకువస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ లో ప్రకటించిన విధంగా ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ ప్రయోజనాలు అందించే ఉద్దేశ్యంతో డిసెంబర్ నెలాఖరులో కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది.
కాగా ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెస్ స్కీమ్ ను పొడిగించింది సీబీడీటీ. 2024 ఏప్రిల్ 28 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. చందాదారుడు మరణించినట్లయితే ఈ స్కీమ్ కింద రూ. 2.5 లక్షల నుంచి రూ. 7లక్షల బీమా వారికి కుటుంబ సభ్యులకు అందిస్తుంది.
దేశంలో ఎక్కడి నుంచిైనా పెన్షన్ పొందేందుకు ఉద్దేశించిన సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ను తొలిదశ విజయవంతంగా పూర్తిచేసిన నేపథ్యంలో మరో 20 ప్రాంతీయ కార్యాలయాల్లో రెండో దశ చేపట్టనున్నట్లు తెలిపింది. 2025 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.