EPFO Gift: ప్రైవేట్ ఉద్యోగులకు మోదీ సర్కార్ దివాళీ గిఫ్ట్.. కేవలం పిఎఫ్ ఖాతా ఉంటే చాలు ఇక పండగే
EPFO Diwali Gift: మీకు పీఎఫ్ ఖాతా ఉంటే మీకో శుభవార్త. EPFO తన సభ్యులకు దివాళీ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)ను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక ప్రధాన చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అనేక మార్పులు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ మార్పులలో కనీస పెన్షన్‌ను ప్రస్తుత రూ. 1000 నుండి పెంచడం, పదవీ విరమణ సమయంలో పాక్షిక ఉపసంహరణలను అనుమతించడంతోపాటు నెలవారీ ఆదాయం రూ. 15000 కంటే ఎక్కువ ఉన్నవారికి పెన్షన్ పథకాన్ని విస్తరించడం వంటివి ఎన్నో మార్పులను తీసుకురాబోతుంది. ఈ మార్పులను సెప్టెంబర్‌లోనే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మార్పులకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం ప్రభుత్వం అనేక ప్రధాన మార్పులను కూడా పరిశీలిస్తోంది. ఈ మార్పులు చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా ఉంది. ఐటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో భారీ మార్పులు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశించినట్లు మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.
ఈ మార్పులు అమల్లోకి వచ్చాక ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు సభ్యులకు మరింత సులభంగా వేగంగా మారుతాయి. ఈపీఎఫ్ఓ గురించి ఫిర్యాదులు చాలా రోజుల నుంచి వస్తున్నాయని..అయితే వీటిని ఈపీఎఫ్ఓ సిబ్బంది సకాలంలో పరిష్కరించడంలేదని చెబుతున్నారు. ఐటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
ఇక మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వినియోగదారులకు కొత్త యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చేందుకు మార్గాలను పరిశీలించాలని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా తన మంత్రిత్వ శాఖ , ఈపీఎఫ్ఓ అధికారులను కోరారు.
ఇదే కాకుండా ఈపీఎఫ్ సభ్యులు పదవీ విరమణ సమయంలో సులభంగా డబ్బును విత్ డ్రా చేసుకునే విధంగా చూడాలని కార్మిక మంత్రిని కోరారు. ఇది వారి ఆర్ధిక ప్రణాళికను నిర్ధారిస్తుంది. అవసరం అయితే సభ్యులు వారి వార్షిక పించనులో సర్దుబాట్లు చేసుకోవడం కూడా సులభం అవుతుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
దీపావళి కానుకగా ఉద్యోగుల భవిఫ్యనిధి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. దీనిలో నెలలవారీ పెన్షన్ పెంచాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నెలలవారీ కనీస పించనను రూ. 1000 నుంచి 7,500కు పెంచాలని ఉద్యోగుల పెన్షనర్ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ఇక ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను రూ.15,000 నుంచి రూ.21,000కి పెంచే విషయాన్ని ఓసారి పరిశీలించాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 1, 2014 నుండి అమలులోకి వచ్చేలా, EPS పెన్షన్ స్కీమ్ లెక్కింపు కోసం జీతం థ్రెషోల్డ్ రూ.15,000.
EPF ఉపసంహరణ: వివిధ మార్పుల ద్వారా, NPS కింద డబ్బును విత్‌డ్రా చేసే పద్ధతి కూడా EPFOలో మారవచ్చని చెప్పింది. ఇక ఈమధ్యే ప్రభుత్వం ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎమర్జెన్సీ సమయంలో విత్ డ్రా పరిమితిని 50వేల నుంచి లక్ష వరకు పెంచింది. అలాగే ఉద్యోగులు డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే తప్పనిసరిగా 6 నెలల సర్వీసు పూర్తి చేయాలనే నిబంధనను కూడా సడలించారు. ఇప్పుడు ఉద్యోగులు అంతకు ముందు కూడా డబ్బు తీసుకోవచ్చు.