EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది

Mon, 22 Feb 2021-10:29 am,

EPFO Latest News: ప్రతి నెలా ఉద్యోగి బేసిక్ శాలరీలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) రూపంలో చెల్లించనున్నారు. యజమాన్య సంస్థ సైతం తన వాటాగా 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. అయితే New PF Tax Rules ద్వారా  పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Also Read: 7th Pay Commission: 5 ఏళ్ల అరియర్‌తో కలిపి డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike

New PF Tax Rules: ప్రస్తుతం ఉన్న పన్ను నిబంధనల ప్రకారం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (Employees Provident Fund) నుండి పొందిన వడ్డీకి Tax నుండి మినహాయింపు పొందుతున్నారు. అయితే ఏప్రిల్ 1, 2021 నుంచి అధిక ఆదాయాన్ని సంపాదించేవారికి లభించే వడ్డీకి సైతం పన్నులు చెల్లించాల్సి వస్తుంది.

Also Read: SBI Latest News: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త, ఒక్క ఫోన్ కాల్ ద్వారా PIN జనరేట్ చేసుకోవచ్చు

EPFO Latest Update: ‘అధిక ఆదాయం పొందుతున్న ఉద్యోగులు సంపాదించిన మొత్తానికి పన్ను మినహాయింపులను హేతుబద్ధీకరించడానికి, పలువురు ఉద్యోగుల PF Contributionపై పొందిన వడ్డీ నగదును ఆదాయ పన్నుకు చేర్చుతున్నాం. తద్వారా వార్షికంగా రూ .2.5 లక్షలకు మించితే అందుకు పన్ను చెల్లించాలని’ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

EPFO Latest Update: అధిక ఆదాయాన్ని పొందే ఉద్యోగులతో పాటు, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (Voluntary Provident Fund)గా బేసిక్ శాలరీ నుంచి 12 శాతం పెట్టుబడి పెడుతున్న ఉద్యోగులపై సైతం దీని ప్రభావం ఉంటుంది. ఈ పద్ధతిలో అధిక మొత్తం పొందుతున్న వారు సైతం ఆ నగదుకు పన్ను చెల్లించాల్సి వస్తుంది.

Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం

EPFO Latest News: కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో దీనిపై మార్గదర్శకాలు జారీ చేయనుంది. అయితే ముందస్తుగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ వడ్డీపై అధిక మొత్తం పొందే వారికి, వీపీఎఫ్ సేవింగ్స్‌పై అధిక ప్రయోజనాలు పొందుతున్న వారి నుంచి అధికంగా పన్నులు వసూలు చేయనున్నారు.

Also Read: BSNL Promotional Offer: ఈ రీఛార్జ్ ప్లాన్‌తో డబుల్ డేటా, మరిన్ని ప్రయోజనాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link