EPFO Pension: 150 మిలియన్ల ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి EPF నుంచి ప్రతినెల రూ.10,000 పెన్షన్ పొందండి..
EPF కోసం ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారి జీతాల పెంపునకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. దీని కారణంగా పెన్షన్ కు ప్రయోజనాలు కూడా అద్భుతంగా పెరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ తెలుపబోతోంది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనివర్సల్ పెన్షన్ సిస్టం కింద అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిస్టం ప్రైవేట్ ఉద్యోగులకు చెల్లుబాటు కాదు.. కాబట్టి ఈ అసమాన తను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారి జీతాలు విపరీతంగా పెరిగితే.. EPO కాంట్రిబ్యూషన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణంగా పీఎఫ్ ఖాతాలో డబ్బు మరింత జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ప్రైవేటు ఉద్యోగులు కూడా పదవి విరమణ తర్వాత భారీ మొత్తంలో పెన్షన్ పొందగలుగుతారు..
ఇప్పటికే కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రపోజల్ కు సంబంధించిన పూర్తి వివరాలను డాక్యుమెంట్స్ రూపంలో ఆర్థిక శాఖకు సమర్పించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి గ్రీన్ సిగ్నల్ రాగానే ఒక్కసారిగా ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
అయితే ఈ ప్రపోజల్ ప్రకారం ఈపీఎఫ్ వేతన పరిమితిని దాదాపు రూ.21 వేలకు పైగానే పెంచమని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రపోజల్ను ఆర్థిక శాఖ ఆమోదిస్తే త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఘననీయమైన పెరుగుదల చోటుచేసుకుని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ వల్ల నెల జీతం కొంత తగ్గినప్పటికీ.. పదవి విరమణ చేసిన తర్వాత దాదాపు నెలకి రూ.10 వేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇక ప్రైవేటు ఉద్యోగులు ప్రతినెల ఈ ఆదాయాన్ని జీవితకాలం పెన్షన్ రూపంలో పొందవచ్చు.
ఇప్పటికే కార్మిక శాఖ ఉద్యోగ సంఘాలతో ఈ సిఫారసు గురించి చర్చలు జరిపి ఈపీఎఫ్ అధికారులతో కూడా కూర్చొని మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రపోజల్ త్వరలోనే అమల్లోకి వస్తే ప్రైవేటు ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానం పదవి విరమణ తర్వాత పెన్షన్ ని పొందగలుగుతారు.