EPFO: యువతకు అదిరిపోయే బంపర్ ఆఫర్.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్..
ఈపీఎఫ్‌ఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. యంగ్ ప్రొఫెషనల్ (YP) రోల్స్‌లో కాంట్రాక్టు ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. వారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుని రావాలి. విజయవంతమైన అభ్యర్థులను ఏడాదిపాటు విధుల్లోకి తీసుకుంటారు. ఆ తర్వాత మరో మూడేళ్లు పెంచే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 32 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉండాలి.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.65,000 జీతం ఉంటుంది. ఢిల్లీలో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. rpfc.exam@epfindia.gov.in లో డెడ్‌లైన్ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పరిశోధనల్లో అనుభవం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ, ఇతర ప్రభుత్వం స్కీముల్లో అనుభవం కలిగి ఉండాలి. వీళ్లకు ఏడాదికి 12 సెలవులు ఉంటాయి. ప్రోరేటా బేసిస్‌పై లీవులు మంజూరు చేస్తారు.
మహిళ ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్స్ కూడా ఉంటాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిదినాలు. అవసరమైతే వీకెండ్‌లో కూడా పనిచేయాల్సి ఉంటుంది.