EPFO: వచ్చే ఏడాది ఈపీఎస్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న 78లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త
Centralized pension payment system approved: ఈపీఎస్ పెన్షన్ దారులకు బిగ్ అలర్ట్. కేంద్రం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ గురించి కీలక అప్ డేట్ వెలువరించబోతోంది. 1995 కోసం కేంద్రీక్రుత పెన్షన్ చెల్లింపు కు ఆమోదం తెలిపింది. దీంతో చాలా మంది ఉద్యోగులకు ప్రయోజనం చేరుకుతుంది. వచ్చే ఏడాది అంటే 2025లో 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ కు ఆమోదం అనేది ఈపీఎఫ్ హిస్టరీలోనే ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక లాంగ్ పెండింగ్ సమస్యలను పరిష్కరించనుంది. ఒక సమర్థవంతమైన పంపిణీ యంత్రాంగాన్ని నిర్ధారిస్తుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండివియా తెలిపారు.
తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం..జనవరి 1, 2025 నుంచి మనదేశంలో ఎక్కడైనా పెన్షనర్లు ఏదైనా బ్యాంకు, ఏదైనా బ్రాంచు ద్వారా డబ్బును తీసుకోవచ్చు. సీపీపీఎస్ ద్వారా పెన్షన్ చెల్లింపు ఆర్డర్స్ పీపీఓ బదిలీ అవసరం లేకుండానే దేశం అంతటా పెన్షన్ పంపిణీ చేసేందుకు ఈ టెక్నాలజీ సహాయపడుతుంది.
పెన్షనర్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారినా కూడా లేదా వారి బ్యాంకు లేదా శాఖ మారినా కూడా కేంద్రీక్రుత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా పెన్షనర్లకు సులభంగా పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత వారి స్వగ్రామానికి వెళ్లే పెన్షనర్లకు ఇది ఎంతో ఉపశమనం కల్పించే వెసులుబాటు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పుడు వికేంద్రీక్రుత పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఉంది. దీనిలో భాగంగా ప్రతి ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయం కేవలం మూడు నుంచి నాలుగు బ్యాంకులతో మాత్రమే అసోసియేట్ అయి ఉంటుండేది. ఇప్పుడు కొత్త సీపీపీఎస్ టెక్నాలజీ ద్వారా పెన్షనర్లు ఎలాంటి అథంటికేషన్ కోసం బ్రాంచికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఉద్యోగుల పెన్షన్ స్కీం కింద పెన్షన్ కావాలనునకునేవారు అర్హులు అయినవారు ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉండాలి. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. 58ఏళ్ల వయస్సు నిండి ఉండాలని తెలిపింది.