Escientia Pharma: క్షతగాత్రులను చూసి భావోద్వేగానికి లోనైన చంద్రబాబు

Thu, 22 Aug 2024-4:35 pm,

Escientia Pharma Incident Ex Gratia: ఏపీలోని అనకా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్లాంట్‌లో 17 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకుని వెంటనే అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు.

Escientia Pharma Incident Ex Gratia: ప్రమాదంలో గాయపడి మెడికవర్, కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించారు.

Escientia Pharma Incident Ex Gratia: పరామర్శించిన అనంతరం బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Escientia Pharma Incident Ex Gratia: పరామర్శ అనంతరం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

Escientia Pharma Incident Ex Gratia: ఎంత ఖర్చయినా అందరికీ వైద్య సేవలందిస్తామని చంద్రబాబు బాధితులకు భరోసా ఇచ్చారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని చెప్పారు.

Escientia Pharma Incident Ex Gratia: భవిష్యత్‌లో ఫార్మా కంపెనీలు, పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

Escientia Pharma Incident Ex Gratia: ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Escientia Pharma Incident Ex Gratia: ఫార్మా ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ఫార్మా కంపెనీ యజమాని కిరణ్‌ ఆచూకీ లభించడం లేదు. 17 మంది మృతికి కారణమైన ఫార్మా కంపెనీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link