Diwali Puja 2024: దీపావళి పూజలో ఈ వస్తువులు లేకుంటే పూజ అసంపూర్ణం.. లక్ష్మీపూజకు కచ్చితంగా ఉండాల్సిన సామగ్రీ!

దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు. కొత్త బట్టలు ధరించి పటాకులు కాల్చే సాంప్రదాయం హిందూమతంలో ఉంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీపాలు వెలిగించి పరిసర ప్రాంతాలన్ని దేదీప్యమానంగా మారుస్తాం.

దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజ విశేషంగా జరుపుతారు. అయితే, ఈ పూజలో కొన్ని వస్తువులు కచ్చితంగా ఉండాల్సిందేనట. లేకపోతే ఆ పూజ అసంపూర్తిగా పరిగణిస్తారు. పండితుల ప్రకారం దీపావళి లక్ష్మీ పూజలో ఉండాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

లక్ష్మీపూజలో వినాయకుడు, ఎర్రటి గుడ్డ, అమ్మవారి ప్రతిమ, వెండి నాణెం, బంగారం, గవ్వలు, తామర గింజలు, పసుపు కుంకుమ, గంధం, కర్పూరం, పచ్చ కర్పూరం, యాలకులు, కాయిన్స్, బచ్చీసలు, తామర పూవు, గోమతి చక్రాలు, నెయ్యి, తెల్లని స్వీట్ ఉండాలి.
దీపావళి లక్ష్మీపూజలో ఆమెతోపాటు విష్ణుమూర్తి చిత్రపటం కూడా ఉండాల్సిందే. దీపావళి సందర్భంగా ఇంట్లో 13 దీపాలు వెలిగించాలి. ఇంట్లో, బయట వెలిగించాలి.
దీపావళి ముందు రోజు ధన్‌తేరాస్, నరక చతుర్దశి జరుపుకుంటారు. ఈరోజు యమదీపం వెలిగించే ఆనవాయితీ కూడా ఉంది. ఈ దీపం వెలిగించడం వల్ల ఆకస్మిక మరణాలు సంభవించకుండా ఉంటాయి. ఉత్తరాదిలో దీపావళి తర్వాత గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం నిర్వహిస్తారు.