Hero Jiiva Accident: వైఎస్‌ జగన్‌ హీరో జీవాకు తప్పిన ప్రమాదం.. ఖరీదైన కారు నుజ్జునుజ్జు

Wed, 11 Sep 2024-4:49 pm,

Jiiva Accident: తెలుగు వారికి సుపరిచితమైన తమిళ సినీ నటుడు జీవా రోడ్డు ప్రమాదం బారినపడ్డాడు. కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్‌ వద్ద కారు బారికేడ్‌ను ఢీకొట్టింది.

Jiiva Accident: రోడ్డుకు అడ్డుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో కారును పక్కకు తిప్పడంతో బారికేడ్‌ను ఢీకొట్టి కారు ఆగింది.

Jiiva Accident: అయితే ప్రమాదంలో నటుడు జీవాకు ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే కారు తీవ్రంగా దెబ్బతింది.

Jiiva Accident: రంగం సినిమాతోపాటు కొన్ని నెలల కిందట విడుదలైన యాత్ర-2లో జీవా వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా మెరిసిన విషయం తెలిసిందే.

Jiiva Accident: తెలుగులో అప్పుడప్పుడు కనిపిస్తున్న జీవా తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు.

Jiiva Accident: ప్రస్తుతం జీవా తమిళంలో బ్లాక్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link