Ex Minister KTR: కొండా సురేఖకు కేటీఆర్ మరోసారి మాస్ వార్నింగ్.. వదిలిపెట్టేది లేదు
తన క్యారక్టర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ తనపై దురుద్దేశపూరితమైన, చౌకబారు కామెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు. అందుకే ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశానని అన్నారు.
గత కొద్ది రోజులుగా తప్పుడు ప్రచారాలు ఎక్కువ అయ్యాయని.. ఇక నుంచి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజాప్రతినిధిగా తన వ్యక్తిగత వివాదాల కంటే ప్రజా సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని అన్నారు.
గతంలో వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదన్నారు. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. రాజకీయ విమర్శల పేరుతో ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కోర్టు తీర్పు గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు.