Chanakya Niti: మగవాళ్లు ఎక్కువ శాతం ఇతర స్త్రీలకు ఎందుకు ఆకర్షితులవుతారు? ఈ 5 వివాహేతర సంబంధాలకు అసలు కారణాలు..
వివాహం అయిన కొత్తలో ఇద్దరూ బాగా కలిసి పోతారు. కానీ, స్త్రీలు బిడ్డ పుట్టిన తర్వాత పిల్లలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఈ నేపథ్యంలో వారు భర్తతో ఎక్కువ సమయం కేటాయించలేరు. అర్థం చేసుకుంటే సరే.. కానీ, కొంతమంది మగవాళ్లు ఆ సమయంలో కూడా ఇతర స్త్రీలకు ఆకర్షితులవుతారు.
ముఖ్యంగా పెళ్లి అంటే ఒకరినొకరు జీవితాంతం కలిసి అడుగులు వేయడం. అయితే, ఈ ప్రేమలో ఎప్పటికీ స్థిరత్వం కూడా ఉండాలి. ఒకరి మనస్సు ఇంకొకరు అర్థం చేసుకోవాలి. లేకుండా కొంతమంది స్త్రీలు లేదా పురుషులు ఇతరులకు ఆకర్షితులవుతారు.
అంతేకాదు భార్యాభర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం కుదరకపోతే కూడా ఈ వివాహేతర సంబంధాలకు ప్రధాన కారణం అవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి భేదాలు రాకూడదు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే అది విడిపోయే వరకు కూడా దారితీస్తుంది. అందుకే వైవాహిక జీవితంలో నమ్మకం కూడా తప్పనిసరి.
వైవాహిక జీవితంలో ఆకర్షణ కూడా ఎంతో ముఖ్యం. ఒకరిపై ఒకరికి ఆసక్తి, ఆకర్షణ, శారీరక సంతృప్తి లేకుంటే కూడా సంబంధంలో చీలికలకు కారణమవుతుంది. ఏ గొడవలు వచ్చినా ఇద్దరు సర్దుకోవడానికి ప్రయత్నించాలి.
అంతేకాదు వైవాహిక జీవితంలో ఏ తప్పులు దొర్లకుండా ఉండాలంటే కూడా చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకోకూడదు. ముఖ్యంగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరిన తర్వాతే వివాహం చేసుకోవాలి. అప్పుడే వైవాహిక జీవితంలో ఏ సమస్యలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)