Tamannaah Bhatia Pics: మినీ డ్రెస్సులో తమన్నా.. మిల్కీ బ్యూటీ అందాలకు కుర్రకారు ఫిదా!

సినిమాలతో బిజీగా ఉన్నా కూడా.. తమన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మిల్కి ఆరెంజ్ మినీ డ్రెస్సులో అందాల విందు చేశారు. తమన్నా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.

మిల్కీ బ్యూటీ తమన్నా 15 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినప్పడు ఎలా ఉన్నారో ఇప్పటికే.. అదే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. ఎఫ్ 2 కోసం బికినీ వేసిన తమన్నా ముందు మెహ్రీన్ తేలియిందంటే అర్ధం చేసుకోవాలి.
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తమన్నా సినిమాలు చేస్తున్నారు. వెంకటేష్ సరసన ఎఫ్ 3, సత్యదేవ్‌కి జతగా 'గుర్తుందా శీతాకాలం', చిరంజీవికి జోడిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.
కెరీర్ మంచి ఊపు ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసి తమన్నా అందరినీ ఆచార్య పరిచారు . రంగం, బాద్షా, అల్లుడు శీను, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ, కేజీఎఫ్, గనితో పాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేశారు.
తమన్నా తెలుగులో చాలా సినిమాలు చేసినా హ్యాపీడేస్, తడాకా, 100% లవ్, ఎందుకంటే ప్రేమంట, ఊపిరి, రచ్చ, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్ 2 మంచి గుర్తింపు తెచ్చాయి.
తమన్నా భాటియా.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. వెండితెరకు పరిచయమై 15 ఏళ్లు గడిచినా.. ఫేమ్, పాపులారిటీ మాత్రం తగ్గలేదు.