Free Laptop Scheme : మోదీ సర్కార్ స్టూడెంట్స్ కోసం బంపర్ ఆఫర్.. విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ స్కీం ప్రారంభం

Wed, 09 Oct 2024-6:16 pm,

Fact Check: కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా లాప్ టాప్ స్కీం ప్రవేశపెట్టిందని వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పిఐబి ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని పౌరులకు తెలియజేసింది.  

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్ టాప్ పథకాన్ని ప్రవేశపెట్టలేదని. ఇది పూర్తిగా వాస్తవమని ఒక యూట్యూబ్ ఛానల్ వారు తమ వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి ట్రిక్కులను వాడుతున్నట్లు వారు నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. అందులో విద్యార్థులకు కూడా పలు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి.  

కానీ ఉచిత ల్యాప్ టాప్ స్కీమ్ మాత్రం అందులో లేదని నిర్ధారించింది. అంతేకాదు దీనికి సంబంధించి మీకు వాట్సప్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఏవైనా లింకులు వచ్చినట్లయితే వాటిని క్లిక్ చేసి మీ సమాచారాన్ని తెలియజేసే పొరపాటు చేయకూడదని కూడా ఈ సందర్భంగా పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.   

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా తమ సమాచారం మంత్రిత్వ శాఖ పేపర్ ప్రకటనల ద్వారా కానీ, టీవీ ప్రకటనల ద్వారా కానీ, అఫీషియల్ వెబ్ సైట్ల ద్వారా కానీ తెలియజేస్తుందని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకునేందుకు జిల్లా కలెక్టరేట్లను సంప్రదించాల్సి ఉంటుందని కూడా తెలిపారు. 

ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను జిల్లా కేంద్రాన్ని యూనిట్ గా చేసుకొని అమలు చేస్తుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ పథకాలను నిర్వహిస్తారు. అలాగే ఇలాంటి  సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానేదే అన్న సంగతి గమనించాలి.   

ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ స్కీం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే అమలు అవుతుందన్న సంగతి గుర్తించాలి. . మీకు ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ స్కీముల గురించి వివరాలను తెలుసుకోవాల్సి 

అంతేగాని సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ మెసేజ్లను పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని ఈ సందర్భంగా పిఐబి ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది. అలాగే ఇలాంటి ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link