Fixed Deposits: ఎఫ్డీ ఇన్వెస్టర్స్‎కు ఇదే లాస్ట్ ఛాన్స్.. త్వరపడండి.. పూర్తి వివరాలివే

Fri, 06 Dec 2024-9:42 pm,

Fixed Deposits: ఆర్బిఐ వరుసగా 11వ సారి కూడా కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లలేదు. తాజాగా ప్రకటించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో రెపో రేటును 6.5శాతం వద్ద కొనసాగించింది. క్యాష్ రిజర్వ్ రేషియోను మాత్రం కాస్త తగ్గించి బ్యాంకుల ద్రవ్య లభ్యతకు ఛాన్స్ కల్పించింది. దీంతో హోమ్ లోన్ ఉన్నవాళ్లు, తీసుకోవాల్సిన వారు వడ్డీ రేట్లు తగ్గాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి ప్రతిఫలం లభించాలంటే మాత్రం ఇదే మంచి ఛాన్స్ అని చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు.   

ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు రెపో రేటును ఆర్బిఐ పెంచుకుంటూ వస్తోంది. 2023 ఫిబ్రవరి వరకు 2.5 శాతం మేర పెంచి 6.5శాతానికి చేర్చింది. అప్పటి నుంచి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. దీంతో బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచేశాయి.   

గత కొన్ని నెలలుగా ఈ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. అయితే అవకాశం కొన్ని రోజులు మాత్రమే ఉండనుంది. ఎవరైతే సురక్షితమైన ఇన్వెస్ట్ సాధనాల కోసం చూస్తున్నారో..వారు ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అధిక వడ్డీ రేట్లకు కూడా ఇదే ఆఖరి అవకాశం కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   

ఆర్ధిక వ్యవస్థలో నగదు లభ్యతను తగ్గించడానికి పరపతి విధానంలో ఇన్నాళ్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన వైఖరి  అవలంబిస్తూ వస్తుంది. అదే సమయంలో వ్రుద్ధిని త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి ఈమధ్యే వెలువడిన జీడీపీ గణాంకాలే దీనికి నిదర్శనం. ఎందుకంటే కేవలం 5.4 శాతం మాత్రమే వ్రుద్ధిని సాధించింది. దీంతో ద్రవ్యోల్బణం కట్టడి చేసే క్రమంలో వ్రుద్ధిని పణంగా పెట్టడం సరికాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.   

వడ్డీరేట్లు తగ్గించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఆర్బిఐ కనీసం 50 నుంచి 100 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ తగ్గించే ఛాన్స్ ఉందన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి.   

అయితే ఆర్బిఐ వడ్డీ రేట్లను తగ్గించినట్లయితే బ్యాంకులు అంతే వేగంగా ఫిక్స్డ్  రేట్లను తగ్గించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా స్వల్ప, మధ్యస్థ కాలవ్యవధులపై డిపాజిట్ రేట్లను బ్యాంకులు సవరిస్తున్నాయి. దీర్ఘకాలంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై అంత ప్రభావం ఉండకపోవచ్చని సమాచారం. ఒకవేళ ఎక్కువ ప్రతిఫలం ఆశిస్తున్నట్లయితే స్వల్ప, మధ్యస్థ కాల వ్యవధులకు ఫిక్స్డ్ డిపాజిట్లను ఇప్పుడే బుక్ చేసుకోవడం కూడా చాలా మంచిది. 

ఫిక్స్డ్ డిపాజిట్లను తెరిచేందుకు ముందు పలు బ్యాంకులు అందించే రేట్లను సరిపోల్చడం చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 7 రోజుల నుంచి 10ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.75శాతం నుంచి 8శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 9శాతం ఆపై కూడా వడ్డీని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు 9.5 శాతం  వరకు వడ్డీ అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పెట్టుబడులపై రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకు అందించే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ అందించే ఇన్సూరెన్స్ పరిమితి 5లక్షలకు లోబడి ఉండే విధంగా చూసుకోవడం మంచిది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link