School Holidays 2025: ఫిబ్రవరి నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులు తెలిస్తే ఎగిరిగంతేస్తారు..

ఈ ఏడాది జనవరి 9వ తేదీ నుంచి చాలా వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. దాదాపు పది రోజులు ఏపీలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ పండుగకు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇక తెలంగాణతోపాటు మరికొన్ని క్రిస్టియన్ మిషినరీ స్కూళ్లకు సెలవులు నాలుగు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇచ్చాయి. ఈరోజు అంటే జనవరి 28వ తేదీ కూడా కొన్ని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.

ఎందుకంటే ఈ రోజు 'షబ్ ఏ మేరేజ్' ముస్లింలు జరుపుకుంటారు. ఈరోజు వారు మసీదులకు లైట్లతో అలంకరించి, రాత్రి జాగరణ కూడా చేస్తారు. అందుకే ఈరోజు కూడా ఆప్షనల్ హాలిడే. మైనార్టీ స్కూళ్లకు సెలవు. అయితే, గత ఏడాది ఈ సెలవును సాధారణ సెలవుగా ప్రకటించారు. ఫిబ్రవరి నెలలో కూడా విద్యార్థులకు సెలవులు భారీగానే వస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు ఆదివారాలు స్కూళ్లకు సెలవులు, ఒక రెండో శనివారం ఈరోజు కూడా స్కూళ్లకు సెలవు ఉంటుంది.

ఫిబ్రవరి 2: ఈరోజు వసంత పంచమి సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తారు. ఈరోజు సరస్వతి పూజ నిర్వహిస్తారు. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు స్కూళ్లకు సెలవు ఉంటుంది.
ఫిబ్రవరి 14వ తేదీ: 'షబ్ ఏ బారజ్' ఇది కూడా ముస్లింల పండుగ. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. అయితే, ఇది కూడా 'షబ్ ఏ మేరాజ్' మాదిరి ఆప్షనల్ హాలిడే. అయితే, కొన్ని మైనార్టీ స్కూళ్లకు మాత్రం సెలవు ఉంటుంది. మిగతా స్కూళ్లు వాటి మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడుతుంది.
ఫిబ్రవరి 26: ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఇది హిందూవుల పరమపవిత్రమైన పండుగ. శివుడికి ఈరోజు ఉపవాసాలు, జాగరణ చేస్తారు. అందుకే ఈరోజు అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తారు.
ఇక ఇవి మాత్రమే కాకుండా ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి, 24 గురురవిదాస్ జయంతి సందర్భంగా కూడా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి నెలలో కూడా స్కూలు విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి.