Year Ender 2024: కాంట్రవర్సీలతో కాకరేపిన అందమైన ఐఏఎస్ అధికారిణులు.. డిటెయిల్స్ ఇవే..
తెలంగాణలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మిత సబర్వాల్ ప్రస్తుతం యువజన సర్వీసులు, టూరిజం అండ్ కల్చరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అయితే.. ఆమె గతంలో దివ్యాంగులకు రిజర్వేషన్ లు అవసరమా.. అని పెట్టిన పోస్టు దుమారంగా మారింది. అది హైకోర్టు వరకు వెళ్లింది. అంతేకాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి వాటిపై కూడా ఇటీవల స్మిత సబర్వాల్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హజరైన విషయం తెలిసిందే.
ఇక ఆమ్రపాలీ కాట.. తెలంగాణ నుంచి ఏపీకి బలవంతంగా వెళ్లినట్లు చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఈ అధికారిణి సైతం.. టూరిజం శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏపీ కి వెళ్లకుండా.. ఉండేందుకు క్యాట్ వరకు వెళ్లారు. కానీ చివరకు ఏపీకి వెళ్లాల్సిందే నని.. డీవోపీటీ ఆదేశించింది.
ఇక తెలగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ రోహిణి సింధూరీ.. కూడా వివాదాల వల్ల వార్తలో నిలిచారు. రోహిణి సింధూరీ, ఐపీఎస్ రూపా మౌడ్గిల్ మధ్య సోషల్ మీడియా వేదికగ వార్ జరిగిందని చెప్పుకొవచ్చు. వీరిపై ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. దీంతో రోహిణి పై.. రూపా మౌడ్గీల్ పరువు నష్టం దావా సైతం వేశారు.
అందమైన అధికారిణి రాజస్తాన్ బర్మెర్ జిల్లా కలెక్టర్.. టీనా దాబీ సైతం వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె..రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ పునియా ఎస్‌వీయూలో నుంచి దిగగానే కలెక్టర్ టీనా దాబి పలు మార్లు.. తలవంచి వెంటవెంటనే నమస్కారం చేశారు. దీంతో ఉన్నత హోదాలో ఉండి.. ఇలా ప్రవర్తించడం కాంట్రవర్సీగా మారింది.
ఇక పూజా ఖేడ్కర్ వివాదం మాత్రం దేశంలోను సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈమె ట్రైనీ ఉండగానే.. అధికారులకు చుక్కలు చూపించారు. నకిలీ సర్టిఫికెట్లతో పలు మార్లు సివిల్స్ ఎగ్జామ్ రాసినట్లు గుర్తించారు. అధికార దుర్వినియోగంకు సైతం పాల్గొన్నట్లు తెలుస్తొంది. ఈమెను యూపీఎస్సీ డిబార్ చేసిన విషయం తెలిసిందే.