Gold Import Duty: కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించినా.. బంగారం ధర ఎందుకు పెరుగుతోంది
బంగారంపై దిగుమతి సుంకం తగ్గించినప్పుడు ఒక్కరోజులోనే బంగారం ధర దాదాపు 4వేల రూపాయల వరకు తగ్గింది. దీంతో పసిడి ధరలు అప్పట్లో 67 వేల రూపాయల వరకు పడిపోయాయి. కానీ గడచిన 45 రోజుల్లో గమనిస్తే బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది.
బంగారం ధర ప్రస్తుతం 75 వేల రూపాయలను తాకింది. గతంలో బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయిని 75 వేల ఎగువన తాకింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి పసిడి ధరలు చేరుకుంటున్నాయి. తాజాగా మంగళవారం బంగారం ధర తొలిసారిగా 75 వేల రూపాయలను టచ్ చేసింది. ఇప్పుడు మళ్లీ 74 వేల స్థాయికి వచ్చింది.
అమెరికా ఫెడరల్ రిజర్వు నేడు కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గితే మాత్రం పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దసరా నాటికి పసిడి ధర ఏకంగా 80,000 దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను కనుక తగ్గించినట్లయితే అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల రాబడి తగ్గుతుంది. దీంతో ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్ల కన్నా కూడా బంగారం వైపే పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపిస్తారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత నాలుగు నెలల్లో బంగారం దిగుమతులు 12.64 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే చైనా తర్వాత భారత దేశమే అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. భారతదేశానికి దిగుమతి అయ్యే బంగారంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 16% పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించిన బంగారం ధరలు రికార్డు స్థాయికి ఎందుకు పెరుగుతున్నాయని సందేహం కలగవచ్చు. నిజానికి భారతదేశంలో బంగారం ధరలు కేవలం స్థానికంగా ఉండే మార్కెట్ పరిస్థితులు మాత్రమే కాదు. అంతర్జాతీయ పరిస్థితుల్లో ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అంతర్జాతీయంగా గమనిస్తే అమెరికా మార్కెట్లో బంగారం ఒక ఔన్స్ ధర 2600 డాలర్లు దాటింది ఈ ప్రభావం కూడా దేశీయ మార్కెట్లపై కనిపిస్తుంది.