Indian Car Market: ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న కార్లు ఇవే, ప్రత్యేకతలివీ
మారుతి కంపెనీ ఇండియన్ మార్కెట్‌లో సీఎన్జీ ఆధారిత కార్లను విస్తరించే ఆలోచనలో ఉంది. స్విఫ్ట్ సీఎన్జీ నెక్ట్స్ లాంచ్ కానుంది.
ఇక సిట్రోయెన్ సి 3పేరుతో ఇండియాలో 2022లో లాంచ్ కానుంది. అతిత్వరలో మార్కెట్లో రానున్న ఈ మోడల్ కారుపై భారీ అంచనాలున్నాయి.
మారుతి త్వరలోనే ఇండియాలో బొలేనో కొత్త వేరియంట్ లాంచ్ చేయనుంది. 2022 ప్రారంభంలో ఈ వేరియంట్ మార్కెట్‌లో రావచ్చు. కారు ఎక్స్ టీరియర్ కాస్త మారవచ్చు. చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
టాప్ 5 లో మొదటి స్థానంలో ఉంది మారుతి సిలేరియో. వాస్తవానికి ఈ మోడల్ ఇండియాలో 2014లో లాంచ్ అయింది. ఇప్పుడు మారుతి జనరేషన్ మార్చుతోంది. నెక్స్ట్ జనరేషన్ సిలేరియోను ఇండియాలో నవంబర్ మూడవ వారంలో ప్రవేశపెట్టనుంది. రెండు ఇంజన్ల ఆప్షన్ ఉంది.