Fish Eggs: చేప గుడ్లతో మైండ్ బ్లాంక్ అయ్యే ప్రయోజనాలు.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు..
సాధారణంగా చాలా మంది మార్కెట్ లలో చేపలు కొనడానికి వెళ్తుంటారు. అక్కడ చేపలను కట్ చేయించి ముక్కలను మాత్రమే ఇంటికి తీసుకువస్తుంటారు. చేపలను కత్తితో కట్ చేసేటప్పుడు వాటి మొప్పల కింద అనేక గుడ్లు ఉంటాయి. వీటిని క్లీన్ చేసి చేపలను మాత్రమే తీసుకొని వెళ్తుంటారు.
కొందరు దీన్ని వెస్టేజ్ అని తమతోపాటు ఇంటికి తీసుకొని వెళ్లరు. కానీ చేపల గుడ్లు డైలీ తింటే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చేప గుడ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపు మెరుగుపరుస్తుంది.
చేప గుడ్లు తినడం వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. చేప ఎనిమీయాను అరకడుతుంది. ఇది ఎముకలు, దంతాల గట్టితనానికి ఉపయోగపడుతుంది. అతిగా స్పందించడం, మతి మరుపు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
చేపగుడ్లు బీపీని, గుండె జబ్బులను దూరం చేస్తాయి. వీటిలో మినరల్స్, విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. చేప గుడ్లు తినేవారు యవ్వనంగా ఉంటూ, చర్మం మెరుస్తు ఉంటుంది. తెల్లని వెంట్రుకలు రావడం ను నిరోధిస్తుంది. పీరియడ్స్ వంటి సమయంలో అతిగా బ్లీడింగ్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
పెళ్లైన వారిలో లైంగిక పరమైన హర్మోనల్ వంటి సమస్యలుంటే, చేప గుడ్లను డైలీతినాలి. ఇది కండరాలు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో చేపగుడ్లను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతుంటారు.
చేపలను, చేప గుడ్లను కర్రీలుగా వండుకుని లేదా ఫ్రైలుగా కానీ చేసుకుని తింటే మన శరీరానికి పుష్కలమైన ఆరోగ్య లాభాలు కల్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రెగ్నెంట్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుందని చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)