Delhi: దెయ్యాలకు అడ్డాగా మారిన ఢిల్లీ.. ఈ ఐదు చోట్లకు వెళ్లాలంటేనే హడల్.. అవేంటో తెలుసా..?

Thu, 23 May 2024-1:27 pm,

దేశ రాజధాని ఢిల్లీ అనగానే మనందరికి ముందుగా ఎర్రకోట గుర్తుకు వస్తుంది. కానీ ఢిల్లీలో అనేక అద్బుతమై కట్టడాలు కూడా అనేకం ఉన్నాయి. అదే విధంగా వీటిని వెనుక వందల ఏళ్లనాటి కథనాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాడానికి అక్కడి స్థానికులు అస్సలు సాహాసం చేయరంట. 

ఫిరోజ్ షా కోట్లా కోట.. ఈ కోటను 14వ శతాబ్దంలో ఫిరోజ్‌షా తుగ్లక్ కట్టించాడని చెబుతుంటారు. ప్రస్తుతం ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ కొందరు శుక్రవారం వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని చెబుతారు. ఇక్కడ వెరైటీగా శబ్దాలు వస్తాయంట.

అదే విధంగా, ఢిల్లీలో ఖూనీ దర్వాజా అనే మరోక  ప్రదేశం ఉంది. దీన్ని 17వ శతాబ్దంలో షాజహాన్ నిర్మించాడు. మొఘల్ రాజవంశానికి చెందిన అనేక మంది రాకుమారులు దీనిలో హతమార్చపడ్డారని చెబుతుంతారు. ఇక్కడ కూడా రాత్రిపూట వింత ఆకారాలు కన్పిస్తాయని స్థానికులు చెబుతుంటారు.

అగ్రసేన్ బావోలీ..ఈ కట్టడంలో దాదాపు.. 100 కంటే ఎక్కువ మెట్లు ఉన్న బావి ఉంటుంది. దీనిని 14వ శతాబ్దంలో మహారాజా అగ్రసేన్ నిర్మించాడని చెబుతారు. రాత్రిసమయంలో ఇక్కడ ఏడ్చిన సౌండ్ లు కూడా వినిపిస్తాయని చెబుతారు. ఇక్కడ ఉండటానికి ఎవ్వరు ధైర్యం చేయరు.

జమాలి కమలీ సమాధి 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్క మీరానా జహీర్-ఉద్-దిన్,  అతని భార్య కమాలి సమాధి నిర్మించబడి ఉంది. ఇప్పటికి కూడా ఇక్కడ రాత్రిపూట వీరి ఆకారాలు కన్పిస్తాయని చెబుతారు. ఏవరో ఏడ్చినటువంటి శబ్దాలు కూడా వస్తాయని అంటుంటారు.

భూలీ భటియారీ రాజభవనం.. ఈ ప్యాలెస్ ఉండే ఒక యువరాణి అతని ప్రేమికుడి నుంచి దూరం చేసి బంధించారంటా. అప్పటి నుంచి ఆమె బాధతో కుమిలిపోయి ఇదే భవనంలో చనిపోయిందంట. ఇక్కడ రాత్రిపూట ఎవరు నడుస్తున్నట్లు, వింత ఆకారాలు, వెరైటీ శబ్దాలు ఇప్పటికి వినిపిస్తాయని చెబుతుంటారు. ఈప్లేస్ లకు వెళ్లడానికి ఎవరు కూడా అస్సలు దైర్యం చేయరని తరచుగా స్థానికులు చెబుతుంటారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link