Horrible Murders: ఈ హత్యల కథ తెలిస్తే గజగజా వణికిపోతారు..ప్రపంచంలో అత్యంత భయంకరమైన స్టోరీలు ఇవి..!!

Tue, 30 Jul 2024-6:38 pm,

Horrifying Murders: హత్య అంటేనే భయంకరం.ఒక మనిషి హత్య చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. సినిమాల్లో హత్యలు చేయడం చూస్తుంటాం. కొన్ని సీన్స్ చూస్తుంటే వెన్నులో వణుకుపుడుతుంది. అయితే అలాంటి హత్యలు నిజజీవితంలో కూడా చాలా జరిగాయి..జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఈ 5 హత్యల గురించి చదివితే..ఒళ్లు గగుర్పొడించేలా ఉంటాయి. అలాంటి కథలు చదవడానికి కానీ వినడానికి కానీ చాలా ధైర్యం ఉండాలి. అలాంటి మర్డర్ స్టోరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

జాక్ ది రిప్పర్ ఊచకోత: 19వ శతాబ్దంలో లండన్ లో జరిగిన ఈ హత్యలు నగరాన్ని మొత్తం భయబ్రాంతులకు గురిచేశాయి. ఆ హత్యలు ఎవరు చేశారన్నది ఇప్పటికీ సస్పెన్స్. అతను చేసిన హత్య విధానం అత్యంత క్రూరత్వంగా తలచుకుంటేనే గుండెఆగేలా ఉంటుంది. 

చార్లెస్ మాన్సన్ హత్య కేసు:1969లో మాన్సన్ కుటుంబ హత్యలు అమెరికాను భయబ్రాంతులకు గురిచేసింది. చార్లెస్ మాన్సన్ అతని అనుచరులు టెక్సాస్ లో పదుల సంఖ్యలో హత్యలు చేశారు. ఈ హత్యలు అగ్రరాజ్యాన్ని కదిలించాయి. మాన్సన్ ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్ గా మారాడు. చివరికి 2017లో జైలులో మరణిచాడు.

జెఫ్రీ డామర్ హత్య:1978, 1991 లో జరిగిన ఈ హత్యలు ప్రపంచాన్నినివ్వేరపోయేలా చేశాయి. జెఫ్రీ డామర్ అనే వ్యక్తి 17 మంది యువకులను, పిల్లలు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాధితులను అత్యంత క్రూరత్వంగా హింసించిన చంపాడు. 

జెఫ్రీ కజినోస్ హత్య: ఆండ్రూ కజినోస్ అనే వ్యక్తి 1980లో తన భార్య, పిల్లలతో సహా పలువురు అత్యంత దారుణంగా హత్య చేశాడు. తన నేరాలు భయటపడకుండా కొన్నేండ్ల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. కానీ చివరికి నిందితుడు పోలీసులు పట్టుకున్నారు. 

హోలోకాస్ట్: ఇది చరిత్రలో అతిపెద్ద ఊచకోత. ఈ ఊచకోతలో లక్షలాది మంది యూదులను నాజీలు అత్యంత భయంకరంగా చంపారు.   

గమనిక: ఈ కథనాలు పబ్లిక్ డొమైన్‌లో  అందుబాటులో ఉన్న సమాచారంగా ఆధారంగానే రాసినవి. వీటి కంటే భయంకరమైన హత్య కేసులు ప్రపంచంలో చాలానే ఉండవచ్చు ఈ మారణకాండల గురించి ఎక్కువగా ఆలోచించడం కొందరి మానసిక ఆరోగ్యానికి హానికరం. ఈ కథను పాజిటివ్ గా తీసుకొని మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.ఇది ఎవరినీ ఏదైనా చేయమని ప్రేరేపించడానికి ఉద్దేశించినది కాదు. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link