Flipkart Black Friday Sale: ఆఫర్ల జాతర అంటే ఇదేగా.. ఫ్లిఫ్‌కార్ట్‌లో 24వ తేది నుంచి Black Friday Sale ప్రారంభం!
![24వ తేది నుంచి Flipkart Black Friday Sale 2024](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Blackfridaysale1.jpg)
ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న Black Friday Sale సేల్ ఈ నెల 24వ తేది నుంచి ప్రారంభమై 29వ తేది ముగుస్తుంది. అలాగే ఫ్లిఫ్‌కార్ట్ దీనిని ఇయర్ ఎండింగ్ సేల్‌గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
![క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ Black Friday Sale](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Blackfridaysale2.jpg)
ఈ Black Friday Sale సేల్‌లో భాగంగా వస్తువులను యాక్సిస్ బ్యాంక్, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDFC బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా నో కాస్ట్ EMI ఆప్షన్‌ను అందిస్తోంది.
![80 శాతం వరకు డిస్కౌంట్ Flipkart Black Friday Sale](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Blackfridaysale3.jpg)
ఇక ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేసేవారికి ఊహించని డిస్కౌంట్ లభించబోతోంది. ఈ సమయంలో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేసిన దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఇక స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేసేవారికి ఇది ఎంతో ప్రత్యేకమైన సేల్‌గా భావించవచ్చు. రియల్‌మీ, మోటరోలా, వీవో వంటి బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది.
ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఎలక్ట్రిక్ పరికరాలు కూడా దాదాపు 80 శాతం తగ్గింపుతో లభించబోతున్నాయి. అంతేకాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్, టాయిస్ భారీ డిస్కౌంట్‌తో రాబోతున్నాయి.
ఇక స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మెషిన్స్ అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం.. వీటన్నింటిని Black Friday Sale సేల్‌లో 75 శాతం తగ్గింపుతో పొందవచ్చు.