Flipkart Month End Mobile Fest: 5 వేల బడ్జెట్‌లో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Realme C21Y
రియల్‌మి కంపెనీకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ 9 వేల 999 రూపాయలకు బదులు 9 వేల 499 రూపాయలకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించుకుని మరో 480 రూపాయలు తగ్గించుకోవచ్చు. ఎక్స్చేంజ్‌లో మీ పాత ఫోన్‌కు 8 వేల 650 రూపాయలు తగ్గుతుంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 369 రూపాయలకే వస్తుంది.

Samsung F12
శాంసంగ్ కంపెనీకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 12 వేల 999 రూపాయలు కాగా సేల్‌లో 10 వేల 499 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇందులో ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే మరో 9 వేల 8 వందల రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 699 రూపాయలకే లభించనుంది.

Redmi 9i Sport
రెడ్‌మి కంపెనీకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 9 వేల 999 రూపాయలు కాగా, సేల్‌లో 8 వేల 999 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే..మరో 8 వేల 450 రూపాయలు తగ్గుతుంది. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 549 రూపాయలకే లభించనుంది.
Poco C31
పోకో కంపెనీకు చెందిన ఈ 32 జీబీ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 10 వేల 999 రూపాయలు. సేల్‌లో 7 వేల 999 రూపాయలకు లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ మినహాయిస్తే మరో 7 వేల 4 వందలు తగ్గుతాయి. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 599 రూపాయలకే లభించనుంది
Infinix Note 11
14 వేల 999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో భాగంగా కేవలం 10 వేల 499 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే..మరో 9 వేల 8 వందల రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ మీకు 699 రూపాయలకే లభించనుంది.