Speed weight loss foods: వేగంగా అధిక బరువు తగ్గించే ఫుడ్స్

Fri, 08 Jan 2021-6:33 pm,

Horse gram ఉలువలు : ఉలువలు రోజూ తినడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్లు, మినెరల్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఉలువల్లో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇవి అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి. 

బరువు తగ్గడానికి డైటింగ్ చేసేవాళ్లు ఈ ఉలువలతో చేసిన వంటకాలను ఎంచుకోవడం వల్ల అంత త్వరగా ఆకలి వేయకపోవడంతో పాటు బరువు తగ్గేందుకు సైతం ఉపయోగపడతాయి.

ఉలువలు రోజూ తినడం వల్ల పొట్టలో కొవ్వు ( Belly fat ) కరిగి వేగంగా అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Soybean oil vs Coconut oil benefits: సోయబీన్ ఆయిల్‌తో చేసే వంటకాలు తింటే అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంది. సోయబీన్ ఆయిల్‌లో ఉండే ఫ్యాట్సే అందుకు కారణం. అదే సమయంలో కోకోనట్ ఆయిల్‌తో చేసే వంటకాలను తినడం వల్ల కొవ్వు కరిగి అధిక బరువు కోల్పోతారు అని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ రెండు టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ ఆహారంలో భాగంగా తీసుకుంటే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగే అవకాశం ఉందని సదరు అధ్యయనాలు చెబుతున్నాయి.

Spinach పాలకూర: ఉడకబెట్టిన కోడి గుడ్లతో పాటు పాల కూర ఆకులతో వండిన కూరను మిశ్రమంగా ( Spinach with boiled eggs ) కలిపి తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుందని న్యూటిషనిస్టులు చెబుతున్నారు. పైగా కండరాల ఆరోగ్యం మెరుగుపడి శరీరానికి శక్తిని కూడా ఇస్తుందట.

Oat meal: అధిక బరువు కోల్పోవాలనుకునే వారు ఎంచుకోవాల్సిన ఫుడ్స్‌లో అన్నింటికంటే ముందుడేది ఈ ఓట్ మీల్. ఓట్స్‌తో పాటు ఉడకబెట్టిన కోడి గుడ్లు ( Oats with boiled eggs ) అల్పాహారంగా తీసుకుంటే శరీరంలో మెటాబాలిజం మెరుగుపడుతుందని.. తద్వారా అధిక బరువు కోల్పోయి సన్నబడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Avocado అవోకాడో: అవొకాడోలో ఉండే మోనోఅన్‌సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పొట్టలో ఉండే అధిక కొవ్వును కరిగిస్తాయి. అన్నింటికిమించి బరువు కోల్పోవడానికి దోహదపడే మెటాబాలిజం మెరుగుపడటానికి ఈ అవకాడో మరింత సహాయపడుతుంది. ఫలితంగా వేగంగా అధిక బరువు తగ్గేందుకు వీలు ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link