Free Bus Pass: 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్.. దీనికి ఎలా అప్లే చేసుకోవాలి?
గతంలో కూడా వృద్ధులకు, పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ప్రజల నుంచి ఎన్నో డిమాండ్ వచ్చినప్పటికే ఆనాటి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల వీరి డిమాండ్లను వినిపించుకుని కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది.
ఈ పథకం అమల్లోకి వస్తే.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తెలంగాణాలోకి ఎక్కడైనా ఫ్రీగా ప్రయాణాలు చేసేందుకు అర్హులవుతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమ శాఖ ఏటా ఉచిన బస్ పాస్‌లను అందిస్తోంది..
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, వృద్ధులతో పాటు వికలాంగ ప్రయాణీకులకు సీట్ల రిజర్వ్‌లో కూడా ప్రత్యేకమైన కోటాను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ ఫ్రీ బస్ (Free Bus Pass) పాస్‌కి సంబంధించిన కీలక ప్రకటను తెలంగాణ రాష్ట్ర సర్కార్ త్వరలోనే చేయబోతోంది. ఈ పాస్ ద్వారా ఇతర ప్రైవేట్ బస్సులో రాయితీ కూడా లభించనుంది.
త్వరలోనే ఈ ఫ్రీ బస్ పాస్ అందుబాటులోకి వస్తే.. దీనిని అప్లై చేయడానికి కొన్ని ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పాస్ పొందడానికి తెలంగాణలో నివాసితలై కాకుండా భారతీయ నివాసిగా కూడా గుర్తింపు కార్డులు ఉండాల్సి ఉంటుంది.
ఈ ఫ్రీ బస్ (Free Bus Pass) పాస్‌ను అప్లై చేసుకోవాడానికి, తప్పకుండా ఆధార్ కార్డ్ కాపీ అవసరమవుతుంది. అంతేకాకుండా పాస్‌పోర్ట్‌తో పాటు నివాస రుజువు, దరఖస్తు పత్రం కూడా అవసరమవుతుంది.