Banks Closed: శుక్రవారం బ్యాంకులకు సెలవు.. ఈరోజే మీ పనులు పూర్తి చేసుకోండి..!
శుక్రవారం బ్యాంకులకు సెలవు రానుంది. ఈ నేపథ్యంలో మీ బ్యాంక్ పనులు ఈరోజే పూర్తి చేసేయండి. ఈరోజు అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు రానుంది. ఈ సందర్భంగా 2024 సెప్టెంబర్ 20న బ్యాంకులు బంద్ ఉంటాయి. శుక్రవారం ఎక్కడ? ఎందుకు? బ్యాంకులు బంద్ ఉండనున్నాయి తెలుసుకుందాం.
సెప్టెంబర్ మాసం కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తున్నాయి. మొన్నటి వరకు బ్యాంకులు పండుగల నేపథ్యంలో వచ్చాయి. అయితే, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం శుక్రవారం (20న) కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.
సాధారణంగా బ్యాంకు సెలవులు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌తోపాటు స్థానిక సెలవుల పండుగ సెలవుల ఆధారంగా కూడా ఆప్షనల్ సెలవులు కూడా ఉంటాయి. శుక్రవార మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించాయి.
అయితే, ఈ మిలాద్ ఉన్ నబీ సెలవు తెలుగు రాష్ట్రాల్లో వర్తించదు. జమ్మూ కశ్మీర్‌లో ఉన్న రాష్ట్రవ్యాప్త అన్నీ పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మిలాద్ ఉన్ నబీ ప్రతి ఏడాది నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో ఈ పండుగను సోమవారం 16వ తేదీన నిర్వహించారు. అన్ని స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు.
ఈ ప్రత్యేక రోజున ముస్లిములు జుమ్మే నమాజ్ చేస్తారు. ఇది ఈద్ ఏ మిలాద్ తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు ఇస్లామిక్ సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటారు. మసీదులకు వెళ్లి ఈ వేడుకను జరుపుకుంటారు.
అయితే, రేపు 20వ తేదీ శుక్రవారం జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంది. 21వ తేదీ శ్రీ నారాయణ గురు సమాధి అయిన రోజు సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం కాబట్టి ఆరోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు. 23వ తేదీ మహారాజ హరీసింగ్ జన్మదినం సందర్భంగా జమ్మూ,శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు. 28వ తేదీ నాలుగో శనివారం, 29 ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు సెలవు.