Tollywood Best Friends: ఎన్టీఆర్, రాజీవ్ కనకాల సహా తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరున్నారంటే.. పార్ట్ -2
ఎన్టీఆర్ - రాజీవ్ కనకాల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
రామ్ చరణ్ - శర్వానంద్
రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరి స్నేహం స్కూల్ డేస్ నుంచే మొదలు కావడం విశేషం.
రామ్ చరణ్ - రానా రామ్ చరణ్, రానాల మధ్య చిన్ననాటి నుంచే స్నేహం ఉంది. అంతేకాదు వీళ్లిద్దరు కలిసి మెలిసి పెరిగారు.
నితిన్ - అఖిల్
నితిన్ అఖిల్ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ‘అఖిల్’ సినిమా మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది.
రానా - నాగ చైతన్య
రానా దగ్గుబాటి, నాగ చైతన్య వీళ్లిద్దరు సొంత బావ బామ్మర్దులు. చిన్నప్పటి నుంచే తాత రామానాయుడు ఇంట్లో వీళ్లిద్దరు కలిసి మెలిసి పెరిగారు. అది స్నేహంగా మారింది.
సాయి దుర్గ తేజ్ - నవీన్ నరేష్
సాయి దుర్గ తేజ్, సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ ఇద్దరు జాన్ జిగ్రీ దోస్తులు. వీళ్లిద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా మలుచుకుంటారు.
నారా రోహిత్ - శ్రీ విష్ణు
నారా రోహిత్, శ్రీ విష్ణు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. శ్రీ విష్ణు సినీ ఇండస్ట్రీలో రావడానికి రోహిత్ సహకారం ఉందనేది అందరు చెప్పుకుంటారు.
జెనీలియా - రామ్ పోతినేని: ‘రెడీ’ సినిమా నుంచి రామ్ పోతినేని, జెనీలియా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న ఇప్పటికీ వీళ్ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.
అల్లరి నరేష్ - నాని:
అల్లరి నరేష్, నాని మధ్య కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఒకరి ఇంట్లో జరిగే శుభకార్యాలకు మరొకరు వెళుతుంటారు.