Aamir Khan And Kiran Rao Divorce: ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ నుంచి అర్బాజ్, మలైకా అరోరా వరకు బాలీవుడ్‌లో షాకింగ్ విడాకులు ఇవి
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా అభిమానులు పిలుచుకునే నటుడు ఆమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తాము విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. 2006లో వీరి వివాహం జరగగా పదిహేనేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు. వీరికి సంతానం ఆజాద్ ఉన్నాడు. సినిమాలు, పానీ ఫౌండేషన్ పనులు ఇద్దరం కలిసి చూసుకుంటున్నామని ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ తెలిపారు. ఆమిర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకోగా 2002లో విడాకులు తీసుకున్నారు.
బాలీవుడ్‌లో షాక్‌కు గురిచేసిన మరో విడాకులు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా జంటవి. 1998లో అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా వివాహం చేసుకోగా, 2017లో విడాకులు తీసుకున్నారు. 19 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. వీరికి సంతానం అర్హాన్ ఖాన్ ఉన్నాడు. మలైకా ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుండగా, అర్బాజ్ త్వరలోనే మరో వివాహం చేసుకోబోతున్నాడని తరచూ ప్రచారం జరుగుతోంది. (Pic Courtesy: Instagram)
బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ జంటలలో హృతిక్ రోషన్, సుసానే ఖాన్ జోడీ ఒకటి. ఎంతో ప్రేయగా, అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2004లో హృతిక్ రోషన్, సుసానే ఖాన్ వివాహం జరగగా, 14 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం 2014లో విడిపోయారు. వీరికి సంతానం ఇద్దరు చిన్నారులు రెహాన్, హృదాన్ ఉన్నారు. కుటుంబ కార్యక్రమాలలో కలిసి పాల్గొంటున్నారు.
రాజ్‌కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ నటి కరిష్మా కపూర్, వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను 2003లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొంతకాలానికే వీరి మధ్య విభేదాలు వచ్చినా దాదాపు 13 ఏళ్ల అనంతరం బంధానికి స్వస్తి పలికారు. వీరికి సంతానం కియాన్ రాజ్ కపూర్, కుమార్తె సమైరా ఉన్నారు.
బాలీవుడ్‌లో బెస్ట్ కపుల్స్‌గా కనిపించిన నటి కల్కి కొచ్లిన్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ తక్కువ కాలంలోనే విడాకులు తీసుకున్నారు. అనురాగ్ కశ్యప్ సినిమా దేవ్ డి తరువాత 2011లో వీరి వివాహం జరిగింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 4 ఏళ్ల అనంతరం కల్కి కొచ్లిన్, అనురాగ్ కశ్యప్ 2015లో విడాకులు తీసుకున్నారని తెలిసిందే.