Kalki 2898 AD hindi dubbed south movies Collections: హిందీ సౌత్ డబ్బింగ్ వెర్షన్ సినిమాల్లో ‘కల్కి 2898 AD’ ఆ ప్లేస్ అందుకుంటుందా..!
ప్రభాస్ హీరోగా అమితాబ్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు నటించిన ‘కల్కి 2898 AD’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 మూవీ మన దేశంలో హిందీలో ఫస్ట్ డే రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లతో సౌత్ డబ్బింగ్ హిందీ సినిమాల్లో మొదటి ప్లేస్ లో ఉంది.
బాహుబలి సినిమాతో హిందీ మార్కెట్ లో బాహుబలి 2 మూవీపై క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా అక్కడ ఫస్ట్ డే రూ. 41 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సౌత్ డబ్బింగ్ సినిమాల్లో రెండో ప్లేస్ లో ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిందీలో తొలి రోజు రూ. 37.25 నెట్ వసూళ్లను రాబట్టి మూడో ప్లేస్ లో ఉంది.
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. ఈ సినిమా తొలి రోజు హిందీ వెర్షన్ మన దేశంలో రూ. 24.4 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR). ఈ సినిమా హిందీలో మన దేశంలో తొలి రోజు రూ. 20.07 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘2.O’. ఈ సినిమా హిందీలో తొలి రోజు రూ. 19.74 కోట్ల నెట్ వసూళ్లతో 6వ స్థానంలో ఉంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు హిందీలో షారుఖ్ ‘డంకీ’ మూవీ గట్టి పోటీ ఉన్నా.. అక్కడ తొలి రోజు రూ. 15.75 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.