Lucky Zodiac Signs: ఈరోజు నుంచి ఈ 5 రాశులవారికి దశ తిరగబోతుంది.. అఖండరాజయోగమే..!

మేషం.. మేష రాశి వారు గురు పూర్ణిమ రోజు నుండి మంచి కాలం ప్రారంభమైంది. ఉద్యోగంలో ప్రమోషన్, వృత్తిలో నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అనుకున్న లక్ష్యాలను కూడా మేషరాశివారు సాధిస్తారు. ఏ ప్రయత్నం చేసినా బాగా కలిసి వస్తుంది. ఈ సమయం మేషరాశికి అనుకూలం, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

ధనుస్సు రాశి.. ఈ రాశికి అధిపతి బృహస్పతి. వీరికి గురుబలం ఎక్కువగా ఉంటుంది.ఏ విషయంలోనైనా సులభంగా జ్ఞానాన్ని పొందడం ఈ రాశికే సాధ్యమవుతుంది. ఈ సమయంలో వీరికి అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అంతేకాదు జీవిత లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమయంలో ఈరాశివారు ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది.

సింహరాశి.. సింహరాశివారు జ్ఞానం పొందడానికి లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ఇది మంచి సమయం. వ్యక్తిగత ఎదుగుదలకు సహాయపడటానికి కొత్త వ్యూహాలను పొందుతారు. గురువు ఆశీర్వాదం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగతుంది. అంతేకాదు సాధారణంగా వీరు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు..
తులారాశి.. ఈ రాశికి కూడా గురుపౌర్ణమి నుంచి బాగా కలిసే వచ్చే సమయం. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన విషయాలపై స్పష్టత వస్తుంది. తుల రాశి వారు కోరుకున్నది జరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభ రాశి.. కుంభరాశివారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలతను ఇచ్చే కాలం.. కొత్త ఆలోచనలు చేస్తారు. వాటిని కార్యరూపం దాల్చడానికి ఇది ఎంతో మంచి సమయం. కుంభరాశి వారు జీవితంలో జ్ఞానోదయం పొందే అవకాశం . (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)