Fruit leaves: పండ్లే కాదు..వాటి ఆకులు కూడా అద్భుత ఔషధాలే, ప్రాణాంతక వ్యాధులు మాయం
బొప్పాయి ఆకుల్లో పోషక గుణాలు చాలా ఎక్కువ. బొప్పాయి ఆకుల జ్యూస్‌తో డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా దూరమౌతాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. బ్లడ్ షుగర్, జీర్ణక్రియ సమస్యలకు మంచి పరిష్కారం.
మామిడి ఆకులు రక్తపోటు సమస్యకు మంచి పరిష్కారం. మామిడి లేత ఆకులు నమలడం వల్ల స్థూలకాయం, అధిక రక్తపోటు సమస్య దూరమౌతుంది. చర్మం, కేశాల సంరక్షకు కూడా మంచిది.
నేరేడు పండ్లు మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచివి. మధుమేహం నియంత్రణకు నేరేడు ఆకులు తింటే చాలా మంచిది. మలబద్ధకం సమస్య కూడా పరిష్కారమౌతుంది.
జాంకాయ ఆకుల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఫలితంగా చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. జాంకాయ ఆకులతో కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు, అజీర్తి సమస్యలు దూరమౌతాయి. అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు.