Fruits Precautions: ఈ 5 పండ్లు పరగడుపున తింటే ఇక అంతే సంగతులు
బొప్పాయి
బొప్పాయి రోజూ తినడం వల్ల శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. అవసరమైన చాలా పోషకాలు అందుతాయి. కానీ పరగడుపున తీనడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
ఆపిల్
ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అన్నారు. అంటే ఆపిల్ ఆరోగ్యానికి అంత మంచిది. కానీ పరగడుపున మాత్రం తినకూడదు. ఇందులో ఫైబర్‌తో పాటు నేచురల్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పరగడుపున తినడం వల్ల ఈ యాసిడ్స్ కడుపులో రియాక్షన్ కలగజేస్తాయి. దాంతో వాంతులు, విరేచనాలు మొదలు కావచ్చు
జామ
ఉదయం లేచిన వెంటనే జామ పరగడుపున తినకూడదు. ఎందుకంటే ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా అజీర్తి సమస్య తలెత్తుతుంది. అందుకే భోజనం చేసిన కాస్సేపటికి జామ తినడం మంచిది.
బత్తాయి
బత్తాయి లేదా నిమ్మ వంటి సిట్రస్ ప్రూట్స్ పరగడుపున తినకూడదు. దీనివల్ల కడుపు నొప్పి, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
పైనాపిల్
పైనాపిల్ చాలా మంచిది. ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. అయితే పరగడుపున తినకూడదు. ఇందులో ఉండే బ్రోమేలేన్ కారణంగా కడుపులో ఇతర రసాయనాలతో కలిసి సమస్య ఉత్పన్నం చేయవచ్చు.