రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌లో 21 రోజులపాటు లాక్‌డౌట్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్‌డౌన్ కారణంగా ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. అయితే గత నెలలో సాయంత్రం 5 గంటలకు బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొడుతూ వైద్య సిబ్బంది, పోలీసు శాఖల ఉద్యోగులకు మద్దతు తెలిపాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఇళ్లల్లో లైట్స్ ఆఫ్ చేసి బాల్కనీలోకి వచ్చి కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్, టార్చ్ లైట్లు వెలిగించి వెలుగులు పంచేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో నేటి రాత్రి కొవ్వొత్తుల వెలుగులో కరోనా చనిపోతుందని, లైట్లు వేసి కరోనాను తరిమికొట్టాలని కొందరు, అకస్మాత్తుగా లైట్లు ఆఫ్ చేస్తే కరోనాకు ఏం చేయాలో పాలుపోదంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ల ద్వారా స్పందిస్తున్నారు. ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇక్కడ అందిస్తున్నాం..
గమనిక: Twitter, ఇతర సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు సరదాగా షేర్ చేసిన కరోనా మీమ్స్ ఇక్క అందిస్తున్నాం.