Gaja Kesari Raja Yogam: దీపావళి నుంచి ఈ రాశుల వారికి గజకేసరి రాజ యోగం.. వివాహా యోగం.. సొంత ఇళ్లు గ్యారంటీ..

Tue, 15 Oct 2024-9:41 am,
Deepawali Gaja Kesari Rajayogam

దీపావళికి ముందే గ్రహ మండలంలో వృషభ రాశిలో  గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల 3 రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి.  దీంతో ఆ రాశుల వారి జీవితాల్లో ఊహించని  పురోగతి సాధించబోతున్నట్టు తెలుస్తుంది.

దేవ గురువు బృహస్పతి

నవగ్రహాల్లో బృహస్పతి అత్యంత శుభ గ్రహంగా పరిగణిస్తారు. దేవ గురువు బృహస్పతి చంద్రునితో కలిసి ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీపావళికి ముందే అక్టోబర్ 19న గజకేసరి రాజ యోగం ఏర్పడబోతుంది.

Mesha Rasi

మేష రాశి..

మేష రాశి వారికి గజకేసరి రాజయోగం వలన ప్రత్యేక  లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సుల వలన డబ్బుకు లోటుండదు. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఎన్నో  ప్రయోజనాలు అందుకుంటారు. జీవితంలో ఆనందం, శాంతి, సంతృప్తి వెల్లివిరుస్తాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి.

కన్య  రాశి.. వృషభ రాశిలో గజకేసరి యోగం వలన  జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది.  జీవితంలో చాలా సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.  ఉద్యోగలకు,  వ్యాపారాలస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. అంతేకాదు వాహనం, ఆస్తి మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఇదే సరైన  సమయం.

తుల  రాశి.. గజకేసరి రాజయోగం వలన తుల రాశి వారికి మంచి యోగ కాలం అని చెప్పొచ్చు. ఆర్ధికంగా ప్రయోజనాలు పొందుతారు. మానసిక ప్రశాంతత నెలకుంటుంది. చేసే పనిలో విజయం సాధించవచ్చు. ఫ్యామిలీతో సమయాన్ని వెచ్చిస్తారు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రం  ఆధారంగా చెప్పబడిన దాన్ని మేము ఇక్కడ ప్రస్తావించాము.  ZEE Media దీనిని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link