Gaja kesari yog: శ్రావణంలో గజకేసరి యోగం.. ఈ రాశులకు లక్కే లక్కు.. మీరున్నారా..?

Thu, 22 Aug 2024-12:35 pm,

ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది.ఈ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక పండుగ వస్తునే ఉంటుంది. భక్తులు కూడా ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో  24 వ తేదీ నాడు.. అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడనుంది. ఈ క్రమంలో కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం కల్గనుంది.  

సాధారణంగా కొన్నియోగాలు మనిషికి ఒక్కసారిగా ఊహించని లాభాలు కలిగేలా చేస్తాయి. గజకేసరియోగం అనేది ఎంతో ప్రభావవంతమైనదిగా చెప్తుంటారు. దీని వల్ల  కొన్నిరాశుల వారి జీవితంలోని దశతిరిగిపోతుందని చెప్పవచ్చు.  దీని ప్రభావం వల్ల.. అద్భుతమైన ఫలితాలు కల్గుతాయి.

మీనరాశి యోగం.. ఈ  రాశి వారికి గజకేసరి యోగం వల్ల.. ఇప్పటివరకు ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా.. భార్యతరపున వారినుంచి ధనలాభం కల్గుతుంది. విదేశీయోగం ఏర్పడుతుందని చెప్పుకొవచ్చు  

మేషరాశి వారు.. ఈ రాశి వారికి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమైపోతాయి. అంతేకాకుండా.. వీరికి ఉద్యోగాలలో ప్రమోషన్ లు వస్తాయి. లాటరీలు తగిలు చాన్సులు కూడా ఉన్నాయి. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది.  

మిథునం.. ఈ రాశివారికి గజకేసరి యోగం వల్ల ఇప్పటి వరకు ఏర్పడిన.. పనులలో విఘ్నాలు సైతం దూరమౌతాయి. ప్రతిపనిలోను కలిసి వస్తుందని చెప్తుందంటారు. లాటరీలు తగిలే చాన్సులు కూడా లేకపోలేదు. అంతేకాకుండా.. భార్యతరపున ఆస్తులు కలిసివస్తాయి.  

కర్కాటకం.. ఈరాశి వారికి భూములపై పెట్టిన డబ్బులు బాగా కలిసి వస్తాయి. గజకేసరి యోగం వల్ల.. వీరి దశ పూర్తిగా తిరిగిపోతుంది. శ్రావణమాసంలో వీరికి ఈయోగం వల్ల.. ఏడాది పాటు కలిగే ఫలితాలు గొప్ప శుభయోగాలు కల్గుతాయని చెప్తుంటారు.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link