Pankaj Udhas Pics: గజల్ మాంత్రికుడు ఇక లేరు, మహా గాయకుడు పంకజ్ ఉధాస్ అరుదైన ఫోటోలు
గుజరాత్‌లోని జేత్‌పూర్‌లో 1951 మే 17న జన్మించిన పంకజ్ ఉధాస్ ముగ్గురు సోదరుల్లో చిన్నవారు. తండ్రి పేరు కేశూభాయి కాగా తల్లి పేరు జితూ బెన్ ఉధాస్. పంకజ్ సోదరులు కూడా గాయకులే కాన పంకజ్ ఉధాస్ అంత ప్రసిద్ధి పొందలేదు.
పంకజ్ ఉధాస్ గురించి ఓ అంశం బాగా ప్రాచుర్యంలో ఉంది. వేదికపై పంకజ్ ప్రదర్శనకు ఆయన తొలి పారితోషికంగా 51 రూపాయలు వచ్చాయట. ఆ సమయంలో ఇండియా చైనా యుద్ధం జరుగుతోంది. ఆయన పాడిన పాట అయ్ మేరే వతన్ కే లోగో.
పంకజ్ ఉధాస్ 25కు పైగా ఆల్బమ్స్ రికార్డ్ చేశారు. తన గజల్స్ ద్వారా లక్షలాది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 1972లో తొలిసారి బాలీవుడ్‌కు పాడారు. పంకజ్ ఉధాస్ మొదటి ఆల్బమ్ 1980లో విడుదలైంది.
నా కజ్రే కి ధార్, చాందీ జైసా రంగ్, ఎక్ తరఫ్ ఉస్కా ఘర్, పైమానే టూట్ గయే, ఘూంఘ్రూ టూట్ గయే, ఓ సాహిబా వంటి పాటలు పంకజ్ నుంచి వెలువడిన ఆణిముత్యాల్లో కొన్ని.
చిట్టీ ఆయీ పాటతో మార్మోగిన పేరు
పంకజ్ ఉధాస్ అంటేనే ఎన్నో శ్రావ్యమైన గజల్స్ గుర్తొస్తాయి. ఎన్ని గజల్స్ ఉన్నా ఆయన పాడిన చిట్టీ ఆయీ హై మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాటగా నిలిచిపోతుంది. ఆరేళ్ల ప్రాయం నుంచే గజల్స్ పాడుతున్న పంకజ్ ఉధాస్ గజల్ ప్రపంచమే తనదిగా చేసుకున్నారు.