Galaxy S21 Mobiles: రూ.10,000 Cashback ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung

Tue, 08 Jun 2021-1:40 pm,

Instant Cashback on Samsung Galaxy S21 Mobiles | స్మార్ట్‌ఫోన్లకు గత కొన్నేళ్లుగా భలే డిమాండ్ పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఏడాదికేడాదికి పుంజుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ S21+పై భారత్‌లో విక్రయాలకుగానూ భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రూ.10,000 మేర ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో శాంసంగ్ మీ ముందుకొచ్చింది. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.71,999, మరియు 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.75,999కు ఆఫర్ ధరలకు విక్రయిస్తోంది.  (Photo Courtesy: Twitter-Evan Blass)

Also Read: Gold Rate Today In Hyderabad 08 June 2021: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం, పతనమైన వెండి ధరలు

గెలాక్సీ S21+ ఐకానిక్ డిజైన్, ఎపిక్ ప్రో గ్రేడ్ కెమెరాతో తయారైంది. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ ఇందులో అమర్చారు. గెలాక్సీ S21+ సిరీస్ మొబైల్స్‌పై పలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. గెలాక్సీ S21 ఆల్ట్రా, గెలాక్సీ S21+ లేదా గెలాక్సీ S21 స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.15,990 విలువ చేసే గెలాక్సీ బడ్స్ ప్రో మీకు  రూ.990కే లభిస్తుంది లేదా రూ.10,000 షాపింగ్ వోచర్ మీకు ఇన్‌స్టాంట్‌గా శాంసంగ్ కంపెనీ అందిస్తుంది. (Photo Courtesy: Twitter-Evan Blass)

గెలాక్సీ S21కు చెందిన మూడు వేరియంట్ స్మార్ట్‌ఫోన్లు 5G టెక్నాలజీతో భారత్‌లో సేవలు అందించనున్నాయి. గెలాక్సీ S21 ఆల్ట్రా లేదా గెలాక్సీ S21 మొబైల్స్‌పై అప్‌గ్రేడ్ బోనస్ కింద రూ.10,000 మరియు రూ.5,000 వినియోగదారులకు అందిస్తుంది. HDFC Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో ఈఎంఐ ఆప్షన్లతో వీటిని కొనుగోలు చేస్తే బ్యాంకు ఖాతాదారులు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. (Photo Courtesy: Twitter-Evan Blass)

Also Read: LPG Gas Paytm Offer: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, Freeగా LPG Cylinder

గెలాక్సీ S21 ఆల్ట్రా మోడల్‌లో అత్యంత అధునాతన మరియు ఇంటెలిజెంట్ ప్రొ గ్రేడ్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. గెలాక్సీ వేరియంట్లలో ఇప్పటివరకూ ఇదే బెస్ట్ స్మార్ట్ డిస్‌ప్లే అని శాంసంగ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. గెలాక్సీ S21 ఆల్ట్రా ధర రూ.1,04,999 మరియు గెలాక్సీ S21 ధర రూ.69,999గా నిర్ణయించారు. (Photo Courtesy: Twitter-Evan Blass) 

Also Read: WhatsApps Fast Playback Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఇకపై ఆ వేగం పెరుగుతుంది

గెలాక్సీ S21 మూడు రకాల వేరియంట్ మొబైల్స్ శాంసంగ్ సొంతం కంపెనీకి చెందిన ఎక్సినోస్ 2100 చిప్‌సెట్‌తో 5జీ టెక్నాలజీతో రూపొందడం గమనార్హం. గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్ 6 రంగులలో లభ్యం కానున్నాయి. ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ వయోలెట్, ఫాంటమ్ వైట్, ఫాంటమ్ గ్రే మరియు ఫాంటమ్ పింక్ రంగులలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 

జూన్ 30, 2021 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దేశంలోని ఏదైనా శాంసంగ్ షాప్ (Samsung.com/in), శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఏవైనా ఇతర రిటైల్ స్టోర్లు, ఈ కామర్స్ పోర్టల్స్‌లో గెలాక్సీ ఎస్21 సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేయవచ్చునని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.  (Photo Courtesy: Twitter-Evan Blass)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link