Game Changer: అప్పుడు అజ్ఞాతవాసి.. ఇప్పుడు గేమ్ ఛేంజర్.. పెద్ద దెబ్బే పడిందిగా..?
ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి,భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఇక ఇప్పుడు అదే జోరుతో శంకర్ దర్శకత్వంలో దాదాపు మూడేళ్లు నిర్విరామంగా కష్టపడి గేమ్ ఛేంజర్ సినిమా చేశారు. ఈ సినిమా ఈరోజు ఉదయం విడుదల అయింది. నిన్న యూఎస్ఏ లో ప్రీమియర్ షోలు పడగా.. ఇక ఇప్పుడు ఇండియాలో సందడి చేస్తోంది.
ఇక ఈ సినిమా ఫలితం విషయానికి వస్తే.. ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మిగతా హీరోల అభిమానుల నుండి ఈ సినిమాకి యావరేజ్ టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. సమయంలో డైరెక్టర్ సుకుమార్ తో పాటు చిత్ర బృందం అందరూ కూడా రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అన్నారు.
వాస్తవానికి ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకి నిజంగా నేషనల్ అవార్డు ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కూడా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. కానీ శంకర్ తన మార్కు.. చూపించడంలో ఫెయిల్ అయ్యాడనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే.. ఈ సినిమా అటు అభిమానులను కూడా పెద్దగా మెప్పించలేదు అని తెలుస్తోంది. దీనికి తోడు ఒక కొత్త సెంటిమెంటును కొంతమంది వెతుక్కోవడం గమనార్హం.. అసలు విషయంలోకి వెళితే.. 2018లో జనవరి 10వ తేదీన సంక్రాంతి బరిలో నిలిచింది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి.ఇందులో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల మధ్య వచ్చింది కానీ డిజాస్టర్ గా నిలిచింది.
మళ్లీ ఏడేళ్ల తర్వాత అదే సేమ్ డేట్ రోజు గేమ్ ఛేంజర్ విడుదల అయింది. మొత్తానికైతే ఈ రెండు సినిమాలకు ఈ డేట్ పెద్దగా కలిసి రావడం లేదు అని చెప్పవచ్చు ఇక ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.