Ganesh Chaturthi 2024: వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టిస్తున్నారా..? తొండం ఎటువైపు ఉండాలి.. పండితులు ఏంచెబుతున్నారంటే..?

Fri, 30 Aug 2024-3:28 pm,

భాద్రపద మాసంలో చతుర్థి రోజున వినాయకుడ్ని ప్రతిష్టించుకుని పూజించుకుంటారు. పదకొండు రోజులు పాటు తమ స్వామి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించుకుంటారు. అంతేకాకుండా.. తమ విఘ్నాలను దూరం చేసి, అంతా మంచి జరగాలనికూడా వేడుకుంటారు.

పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 12:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 7, 2024 శనివారం మధ్యాహ్నం 2:05 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి 7వ తేదీ ఉండటంతో ఆరోజే వినాయక చవితి జరుపుకోనున్నారు. ఈ కారణంగా గణేష్ చతుర్థి పవిత్ర పండుగ ఉదయతిథి ప్రకారం 7 వ తేదీన తేదీన జరుపుకుంటారు.

ఇదిలా ఉండగా చాలా మంది గణపయ్యను ఇంట్లో లేదా వీధుల్లో మండపాలను ఏర్పాటు చేసి మరీ ప్రతిష్టిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో తొండం ఎటువైపు ఉన్న గణపయ్యను తెచ్చుకుంటే.. మంచి జరుగుతుందో పండితులు అనేక సూచలను చేస్తుంటారు.  ముఖ్యంగా గణపయ్య తోండం ఎల్లప్పుడు కుడివైపున ఉన్న గణేషుడిని తెచ్చుకొవాలని చెప్తుంటారు.

కుడివైపున తొండం ఉన్న వినాయకుడు.. ధైర్యం, సాహాసాలు, ఐశ్వర్యం, చేపట్టిన పనుల్లో విజయం కల్గిస్తాడని చెప్తుంటారు. అందుకే కుడివైపున తొండంఉన్న గణేషుడిని తెచ్చుకుంటే మంచిదని చెప్తుంటారు.  

అదే విధంగా ఎడమ వైపు ఉన్న తొండం ఉన్న గణపయ్య కూడా అదే విధంగా మంచి రిజల్ట్ ఇస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ గణపయ్య ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, బిజినెస్ లు చేసే వారికి లక్ కలిసి వచ్చేలా చేస్తారంట. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభానికి కూడా ఆయన కారణమౌతాడని చెబుతుంటారు  

వినాయుడికి కుడిచేతిలో ఉండ్రాళ్లు, పాదాల దగ్గర తప్పనిసరిగా మూషికం ఉండే విగ్రహంను మాత్రమే తీసుకొవాలంట. అంతేకాకుండా నిలబడి ఉన్నగణేషుడిని కొనకూడదని చెబుతుంటారు. సింహాసనం లేదా ఏదైన వాహానం మీద కూర్చుని, అభయం ఇస్తున్న వినాయకుడిని తెచ్చుకుని పూజించుకుంటే మంచి జరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link