Gem Astrology: ఈ 5 రత్నాలు ధరిస్తే.. మీ దరిద్రం పరార్.. బిచ్చగాడు సైతం బిలియనీర్ కావడం పక్కా..
కొన్ని రత్నాలు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి జాతకంలో ఏదైనా గ్రహం క్షీణ దశలో ఉన్నపుడు ఆ గ్రహానికి సంబంధించిన రత్నం ధరిస్తే చెడు ఫలితాలను నివారించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని రత్నాల గురించి ఇపుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎరుపు రంగు రత్నాన్ని సరిగ్గా ధరిస్తే, జాతకంలో కుజుడు బలోపేతం అవుతాడు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు. దీని వలన ధైర్యం, బలం తో పాటు ఇతరులతో పోరాడే శక్తియుక్తులను ప్రసాదిస్తాడు. యుద్ధం, సైన్యంతో పాటు భూమికి అధిపతి కాబట్టి.. ఈ పగడాన్ని ధరించడం వలన మన జాతకంలో ఏర్పడే కొన్ని రకాల దోషాలను నివారించవచ్చు.
మాణిక్యం రత్నశాస్త్రంలో చాలా అద్భుతంగా పరిగణిస్తారు. జ్యోతిష శాస్త్ర పరంగా ఈ రత్నం ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతిని తీసుకొస్తోంది. ఈ పచ్చ రాయి రత్నం ధరించిన వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ రత్నం ధరించడం వలన అనవసర ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతోంది.
రత్న శాస్త్రం ప్రకారం వైఢూర్యం ధరించడం వల్ల ధైర్యం స్థైర్యం పెరుగుతుంది. ఈ రత్నం ఆర్ధిక ఇక్కట్ల నుండి మిమ్మల్ని బయట పడేస్తోంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల ధరించిన మనిషికి శుభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ రత్న ధారణ వల్ల కోరుకున్న ఉద్యోగం పొందడంలో కూడా సహాయపడుతుంది.
పచ్చ రత్నం బుధుడి గ్రహానికి ప్రతీక. ఈ రత్నం ధరించడం వలన ఒక వ్యక్తిలో ఉన్న ప్రతికూల ప్రభావాలను తొలగించడంలో సహాయ పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రత్నాన్ని ధరించడం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంతో అభివృద్దికి దోహదం చేస్తోంది. అంతే కాకుండా, ఈ రత్నం సంపదను పెంచడంలో తోడ్పడుతుంది. ఇది మాత్రమే కాదు.. ఈ రత్నం కోరికలను నెరవేర్చడంలో ముందు వరుసలో ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నీలమణి పుష్యరాగం దేవగురు గురువు యొక్క రత్నం. ఈ రత్నం ధరించడం వలన జాతకంలో బృహస్పతి మరింత బలపడుతుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల పుత్ర సంతానం, శ్రేయస్సు, వైవాహిక జీవితంలో సంతోషం మొదలైన కోరికలు నెరవేర్చుకోవడానికి ఇదే సరైన రత్నం. ఇది ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.
గమనిక : ఇక్కడ మేము అందించిన సమాచారం ఇంటర్నెట్ తో పాటు జ్యోతిషశాస్త్ర పండితులు చెప్పిన అభిప్రాయాలను మాత్రమే మేము ప్రస్తావించాము. దీన్ని ZEE 24 గంటలు ధృవీకరించడం లేదు.