Telugu Actress: 16 ఏళ్లకే ప్రేమ..10 సంవత్సరాలు డేటింగ్.. ఫైనల్ గా సీఎం కోడుకుని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్

Wed, 07 Aug 2024-8:16 pm,

జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హ..హ..హసిని అంటూ బొమ్మరిల్లు సినిమాతో.. తెలుగు ప్రేక్షకుల మదిలో..చెరిగిపోని ముద్ర వేసుకుంది ఈ హీరోయిన్. ఈ హీరోయిన్ సినిమాల పరంగానే కాదు.. పర్సనల్ లైఫ్ పరంగా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.  

స్టార్ హీరోయిన్ గా సాగుతున్నప్పుడు.. పెళ్లి కోసం సినిమాలను వదిలేసేవారు.. ఎవరు ఉండరు. కానీ జెనీలియా మాత్రం.. తన భర్త పై ప్రేమతో.. సినిమాలను వదులుకునింది. అసలు విషయానికి వస్తే జెనీలియా.. 16 సంవత్సరాలకే.. సీఎం కొడుకుతో ప్రేమలో పడి, దాదాపు పది సంవత్సరాలు డేటింగ్ చేసింది. ఆ తర్వాత తను ప్రేమించిన రితేష్ ని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది.. ఫైనల్ గా తన కెరియర్ సైతం వదులుకొని..అతన్ని పెళ్లి చేసుకోండి.

జెనీలియా 2003లో.. బాలీవుడ్ సినిమా ‘తుఝే మేరీ కసమ్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో.. హీరోగా చేసిన రితేష్ దేశ్‌ముఖ్‌ నే ప్రేమించింది ఈ హీరోయిన్. ఇక అదే సంవత్సరం తమిళంలో.. శంకర్ బాయ్స్ సినిమాతో.. తెలుగులో సత్యం సినిమాతో మంచి విజయాలు అందుకుంది. రాజమౌళి సై సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది.   

ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంతో.. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కాగా తన మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్’లో నటించిన.. రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడినప్పుడు.‌ జెనీలియా వయసు 16 ఏళ్లే. ఆ తర్వాత ..ఇద్దరూ 10 సంవత్సరాలు పాటు డేటింగ్ చేశారు. చివరికి 2012లో పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా రితేష్.. మరెవరో కాదు.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు.

రితేష్ ని చూసిన మొదటిసారే జెనీలియా ఇష్టపడిందట. కానీ రాజకీయ కుటుంబానికి చెందిన వారు కావడంతో అతనికి అహంకారం ఉంటుంది అనుకుందట.  అయితే తన మొదటి సినిమా షూటింగ్ అప్పుడు..అతని వ్యక్తిత్వాన్ని తెలుసుకుని ప్రేమలో పడిందట. కానీ వీరిద్దరి పెళ్ళికి రితేష్ తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వీరిద్దరి పెళ్లికి అంగీకరించలేదు. అయినా ఈ జంట.. పది సంవత్సరాలు పాటు పోరాటం చేసి.. 2012లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంది. అంతేకాదు జెనీలియా క్రిస్టియన్ కావడంతో.. తన భర్త కోసం మతం కూడా మార్చుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link