Colony at 1 Dollar: 5 వందల ఏళ్లలో ఒక్కసారి కూడా అద్దె పెరగని కాలనీ, 7 రూపాయలే అద్దె
ఎంట్రీ ఫీ
ఈ కాలనీ గేట్లు రాత్రి 10 గంటల వరకే తెరిచి ఉంటాయి. ఎవరైనా ఈ గేటెడ్ కాలనీలో ఉండాలనుకుంటే వాచ్‌మెన్‌కు 50 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. అర్ధరాత్రి దాటాక ఎవరైనా ప్రవేశించాలంటే ఒక యూరో ఇవ్వాల్సి ఉంటుంది.
నియమాలు ఇవే
ఈ గేటెడ్ కాలనీలో ఉండేవాళ్లు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రార్ధనలో పాల్గొనడం, కమ్యూనిటీ సర్వీస్ పని చేయడం, వాచ్‌మెన్ లేదా తోటమాలిగా పనిచేయడం చేయాల్సి ఉంటుంది.
కేవలం కొందరికి మాత్రమే
ఫుగేరీ గేటెడ్ కాలనీలో అద్దెకు ఇళ్లు అందరికీ లభించవు. కొన్ని నియమాలున్నాయి. ఈ నిబంధనలు గత 500 ఏళ్లుగా ఉన్నాయి. దీనికోసం కేథలిక్ ఆక్సంబర్గ్ వర్గానికి చెందినవాళ్లే అర్హులు. మీ పూర్వీకులు ఎవరు, వయస్సు ఎంత, కుటుంబ పరిస్థితి ఏంటనే వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
1520లో జాకబ్ ఫుగర్ నిర్మించిన కాలనీ
ఫుగేరీ గేటెడ్ కాలనీలో మొత్తం 57 ఇళ్లున్నాయి. ఇందులో 142 అపార్ట్‌మెంట్స్. 16వ శతాబ్దం మూడవ దశకం ప్రారంభంలో జర్మనీకు చెందిన బ్యాంకర్ జాకబ్ ఫుగర్ నిర్మించాడు. ఆక్సంబర్గ్‌లో ఆర్ధికంగా వెనుకబడినవారికి చౌకగా నివాసం కల్పించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఈ సొసైటీ మెయింటెనెన్స్ ఫుగర్ ఛారిటబుల్ ట్రస్ట్ చూస్తుంటుంది.
ఫుగ్గేరీ గేటెడ్ కాలనీ
జర్మనీలోని ఆక్సంబర్గ్ నగరంలో ఫుగ్గేరీ సోషల్ హౌసింగ్ ప్రోజెక్ట్ ఉంది. ఈ కాలనీను 1521లో నిర్మించారు. ఇక్కడ ఏడాది అద్దె కేవలం 1 డాలర్ మాత్రమే. అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 83 రూపాయలు. నెలకు కేవలం 7 రూపాయలు మాత్రమే. అప్పట్నించి ఇదే అద్దె.