Motorola G54 5G: ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola G54 5Gపై ప్రత్యేక డీల్‌..రూ. 21,999 గల మొబైల్‌ రూ.5,900కే..

Sat, 23 Sep 2023-1:43 pm,

ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా MOTOROLA g54 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. మొదట ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP ధర రూ. 21,999కు విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ కేవలం రూ. 18,999కే అందిస్తోంది.   

ఫ్లిఫ్‌కార్ట్‌లో MOTOROLA g54 5G స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంకు ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రస్తుతం రెండు బ్యాంకు ఆఫర్స్‌ను అందిస్తోంది.   

MOTOROLA g54 5G మొబైల్‌ను బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు..ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకుతో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్‌ చెల్లిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది.   

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ కార్డ్‌ను వినియోగించి MOTOROLA g54 5G స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే దాదాపు రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ రూ. 17,499కే పొందవచ్చు. 

MOTOROLA g54 5G మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ. 11,599 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 5,900కే పొందవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link