Amrapali Kata: ప్లీజ్.. ఆ పనులు చేయోద్దు.. నిమజ్జనంకు వచ్చే భక్తులకు ఆమ్రపాలీ స్పెషల్ రిక్వెస్ట్.. డిటెయిల్స్..

Mon, 16 Sep 2024-9:22 pm,

దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. రేపు (సెప్టెంబర్ 17) దేశవ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. ఇప్పటికే పలు చోట్ల వినాయకనిమజ్జనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 

హైదరబాద్ గణేష్ ఉత్సవాలను ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు.దాదాప్ర ప్రతిగల్లీలో కూడా వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు.. ప్రత్యేంగా పూజలు చేసి, నిమజ్జనం చేస్తారు. చాలా వినాయకులను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తుంటారు.

అయితే.. ఈసారి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయోద్దని తొలుత జీహెచ్ఎంసీ, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాస్తంతా హాడావిడి చేశారు. కానీ భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి రిక్వెస్ట్ ను పరిగణాలోకి తీసుకుని ప్రతి ఏడాది మాదిరిగానే గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాట.. ట్యాంక్ మీద గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మాట్లాడారు. ట్యాంక్ మీద 38 క్రేన్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో.. 465 క్రేన్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా దాదాపు.. 15 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది డ్యూటీలలో ఉంటారని తెలిపారు.  మూడు రోజుల పాటు 3 షిఫ్ట్ లలో క్లీనింగ్ లు చేస్తారని తెలిపారు.   

మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా 10 ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు . కమాండ్ కంట్రోల్ రూమ్ లో సైతం.. జీహెచ్ఎంసీ సిబ్బంది ఉంటారని తెలిపారు. అదే విధంగానిమజ్జనం కోస వచ్చే  ప్రజలకు.. వాటర్, ఆహారం అందేలా ఏర్పాట్లు సైతం చేసినట్లు తెలిపారు.   

ముఖ్యంగా ఆమ్రాపాలీ మాట్లాడుతూ..నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు రిక్వెస్ట్ చేశారు. కొంత మంది రంగు రంగుల పేపర్ లు, కలర్ బౌల్స్, రిబ్బన్స్ లు , థర్మాకోల్స్ తీసుకుని వస్తుంటారు.  ఇవి చల్లుకుంటూ నిమజ్జనం సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇది శుభ్రం చేయడానికి జీహెచ్ఎంసీ సిబ్బందికి చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. ఈ విధంగా పేపర్లు మాత్రం వేయోద్దని జీహెచ్ఎంసీ తరపున రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link