Female Man: 16 ఏళ్ల యువతికి గడ్డం-మీసాలు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ
డైలీమెయిల్ వెబ్‌సైట్ (DailyMail website) ప్రకారం, హర్నామ్ కౌర్ (Harnaam Kaur) 11 సంవత్సరాల వయసులో ఆమె ముఖం మీద గడ్డం పెరగడం ప్రారంభమైంది. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (Polycystic Ovary Syndrome) కారణంగా, ఆమెకు గడ్డం రాలడం ప్రారంభమైంది. ఛాతీ మరియు చేతులపై కూడా వెంట్రుకలు పెరగటంతో ఆమె స్కూల్ కి వెళ్లేటప్పుడు అందరు అవహేళనలను చేసేవారట!
హర్నామ్ కౌర్ కు ఇప్పుడు 16 సంవత్సరాలు, ఇదివరకు ఈ అసాధరణ వెంట్రుకల పెరుగుదలకు సిగ్గుపడేది, వారానికి రెండు నుండి మూడు సార్ల వరకు వాక్సింగ్ మరియు బ్లీచింగ్ మరియు షేవింగ్ చేసేదట. ఇలా చేయటం వల్ల వెంట్రుకల మందంగా, ఎక్కువ రావటం ప్రారంభమైందట.. ఇక వెంట్రుకల భాదతో భయటకి వెళ్లటమే మానేసిందట.. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది.
ఫోటోలో చూసిన ఆమెను చాలా మంది అబ్బాయి అని అనుకుంటున్నారట, అయితే అది నిజాం కాదు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్లిన గడ్డం, మీసాలతో పాటు తలపై ఒక పాగా కట్టుకొని వెళ్తుందట. అది చూసిన జనాలు ఆమెని సర్దార్ ఫ్యామిలీ అని అనుకుంటున్నారట.
ఇపుడు హర్నామ్ ఎక్కడికి వెళ్లిన గడ్డం, మీసాలతో ఆలానే వెళ్తుంది. ఒక మోటివేషనల్ స్పీకర్ (Motivational Speaker)గా ఎదిగిన ఆమె, ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ (Social Media Star)మరియు మోడల్. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 లక్షా 63 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ముఖంపై గడ్డాలు, మీసాలు ఉన్నందున ఈమె పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness World Records) నమోదైంది.
గత సంవత్సరం, బాలీవుడ్ (Bollywood) స్టార్ సోనమ్ కపూర్ (Sonam Kapoor) కూడా ఆమెను ప్రశంసలతో ముంచెత్తింది. కాస్మో ఇండియా కవర్ పేజీలో హర్నామ్ కౌర్ చిత్రాన్ని కూడా ముద్రించారు. ఇప్పుడు ప్రపంచమంతా ఆమె పేరు తెలుసు. ఆమె తన బలహీనతను శక్తివంతమైన ఆయుధంగా చేసుకొని, జీవితంలో ఎదిగిన హర్నామ్ అందరికి ఆదర్శప్రాయం. ఒకపుడు హేళన చేసిన వాడే ఇపుడు హర్నామ్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడుతున్నారు.