Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?
Gold And Silver Rates Today: బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 2 సోమవారం బంగారం ధర 24 క్యారెట్ల, 10గ్రాములు ధర రూ. 73,030 పలికింది. 22క్యారెట్ల బంగారం ధర రూ. 66,940కి చేరింది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే 10 గ్రాముల పై వంద రూపాయల వరకు తగ్గింది. బంగారం ధరలు ఈ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే పలుమార్లు పేర్కొంటున్నారు.
ఇదే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ భేటీ జరగనుంది ఈ నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లు కనీసం పావు శాతం మీద తగ్గించిన భారీ ఎత్తున బంగారం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఒకవేళ ఇదే జరిగితే బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టిస్తుంది.బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం అలాగే ఇతర అంతర్జాతీయ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.
దీన్ని ముందే పసిగట్టిన మదుపుదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తుంటారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా పెరగడం ప్రారంభిస్తుంది. . ఈ పరిణామాలు చోటు చేసుకుంటే బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి 75 వేల రూపాయల పైన నమోదు చేసింది. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఇప్పుడే 73000 ట్రేడ్ అవుతున్నాయి. ఈసారి బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయిని దాటే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు శ్రావణమాసం కూడా ముగిసిపోయింది. ఇక వచ్చేది దసరా దీపావళి సీజన్ ఈ సీజన్ లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేందుకు జనం మొగ్గు చూపుతారు. దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం అనేది భారతీయుల సెంటిమెంట్. అయితే దీని కారణంగా డిమాండ్ పెరిగి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పెరుగుతున్న బంగారం ధరలు ఆభరణాల షాపింగ్ చేసేవారికి కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.
ఎందుకంటే మీరు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఒక గ్రాములో కూడా ఏమాత్రం తేడా వచ్చిన వేల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా దానికి క్వాలిటీ పైన, తూకం విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.