Gold And Silver Rates Today: ప్చ్.. అప్పుడే బంగారం కొంటే బాగుండు.. నేడు స్థిరంగానే బంగారం, వెండి ధరలు
Gold And Silver Rates Today : పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. చాలా రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. అయితే ఆగస్టు 25 ఆదివారం మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,190 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 67,200 రూపాయల వద్ద ఉంది. బంగారం ధరలు గతవారం భారీగా పెరిగాయి. తొలిసారిగా 73,000 రూపాయల మార్కుని అందుకున్నాయి. దీంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినంత పనైంది.
ఎందుకంటే బంగారం ధరలు గత నెలలో రూ. 67 వేల సమీపంలో ట్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం బంగారం ధరలు రూ. 73000 ఎగువన ఉన్నాయి. అంటే దాదాపు 6000 రూపాయలు బంగారం ధర పెరిగింది. గత నెలలో బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కానీ అక్కడి నుంచి బంగారం ధర రికవరీ అవుతూ ప్రస్తుతం 73000 రూపాయల స్థాయిని దాటింది.
బంగారం ధరలు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో అంటే సెప్టెంబర్ మాసంలో ఫెడరల్ రిజర్వ్ భేటీ జరగనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ భేటీలో వడ్డీ రేట్లు 6% మేర తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇందుకు ప్రధానంగా కీలక వడ్డీరేట్లు అమెరికా తగ్గించినట్లయితే అమెరికా జారీ చేసిన ట్రెజరీ బాండ్ల పై రాబడి కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు అమెరికా బాండ్ల కన్నా కూడా బంగారం పైనే డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే బంగారం అనేది పెట్టుబడి స్థాయిలో చూసినట్లయితే, ఒక రకంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా చెప్పవచ్చు. బంగారం మార్కెట్ ఎలా ఎప్పుడు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, బంగారం ధర పెరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారం వైపు పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు వచ్చే నెలలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర మరోసారి ఆల్ టైం రికార్డ్ స్థాయి 75 వేల మార్కును దాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇలా అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధర ప్రస్తుతం అమెరికా మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర 2500 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే బంగారం ధర 2600 నుంచి 2800 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.